బాహుబలిని మించిపోతున్నాడు

బాహుబలిని మించిపోతున్నాడు

'బాహుబలి' చిత్రంలో ఏ పోస్టర్‌ చూసినా, ఏ ట్రెయిలర్‌ చూసినా కానీ రాణా దగ్గుబాటి హైలైట్‌ అవుతున్నాడు. భళ్లాల దేవగా రాణా ఆహార్యం, హావభావాలు ఆకర్షిస్తున్నాయి. బాహుబలిలో ఇప్పటికి చూపించినంత వరకు ప్రభాస్‌ బిట్స్‌ కూడా రాణా మాదిరిగా ఆకట్టుకోవడం లేదు. అయితే విలన్‌ని ఎలివేట్‌ చేయడమే రాజమౌళి విజయ రహస్యం కాబట్టి... అతడిని కొట్టడంలోనే హీరోయిజం చూపిస్తాడనేది పెద్ద రహస్యమేం కాదు.

ఈ చిత్రంలో బాహుబలి, భళ్లాలదేవ పాత్రల మధ్య జరిగే పోరాటమే ప్రధానాకర్షణ అని చెబుతున్నారు. అయితే ఆ పోరాటాన్ని మొదటి భాగంలోనే చూపించేస్తారా లేక రెండవ భాగం వరకు వేచి చూసేలా చేసి ఊరిస్తారా అనేది సినిమా చూస్తే కానీ తెలీదు. చరిత్రలో నిలిచిపోయే విలన్‌ పాత్ర అవుతుంది అని రాణా అంటున్నది ఒట్టి మాటగా కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే కేవలం చిన్న బిట్లు, ఒక డైలాగు చూపిస్తేనే ఈ విలన్‌పై ఇంప్రెషన్‌ బాగా పడిపోయింది. ఇక తెరపై అతని పూర్తి స్థాయి విలనిజం చూస్తే ఇంకెలా అనిపిస్తుందో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు