రాశీ.. చాన్సులెందుకు మిస్సవుతున్నాయ్‌?

రాశీ.. చాన్సులెందుకు మిస్సవుతున్నాయ్‌?

టాలీవుడ్‌లో అప్‌కమింగ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే, జిల్‌ చిత్రాలతో విజయాలు అందుకుని స్పీడు మీద ఉన్న ఈ భామ ఇటీవలి కాలంలో కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్ని కోల్పోయింది. మెగా హీరోలతో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ముఖం చాటేశాయి. బన్ని సరసన సన్నాఫ్‌ సత్యమూర్తిలో నటించాల్సింది. చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని అదాశర్మ ఎగరేసుకుపోయింది. అలాగే చరణ్‌ సరసన శ్రీనువైట్ల సినిమాలోనూ నాయికగా పరిశీలనకు వెళ్లింది. రకూల్‌ ప్రీత్‌ గద్దలా తన్నుకుపోయింది. ఇలా తనకి కేటాయించిన బెర్తులో వేరేవాళ్లు పయనిస్తున్నారిప్పుడు. ఏ రంగంలో అయినా సత్సంబంధాలు చాలా ముఖ్యం. అవే అవకాశాలు తెచ్చిపెడతాయి. దర్శకనిర్మాతలతో సరైన రిలేషన్‌ కొనసాగించ లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం ఇది అనే అనుకోవాలేమో మరి. ఏమంటావ్‌ రాశీ??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు