డీ గ్లామరైజ్డ్‌ లుక్‌.. అయినా పవన్‌ పవనే..!

డీ గ్లామరైజ్డ్‌ లుక్‌.. అయినా పవన్‌ పవనే..!

పవన్‌కళ్యాణ్‌ గడ్డం, జుట్టు పెంచుకుని బైరాగి వేషంలో కనిపిస్తున్నాడీమధ్య. అతను అంతగా గడ్డం పెంచడానికి కారణమేంటనేది మాత్రం ఇంకా తెలియలేదు. గబ్బర్‌సింగ్‌ 2 కోసమని మీడియా సరిపెట్టుకుంటోంది కానీ షూటింగ్‌ మొదలు పెట్టే టైమ్‌కి గడ్డం తీసేస్తాడని టాక్‌ వుంది. మామూలుగా హీరోలు స్టయిలిష్‌గా గడ్డాలు పెంచుతుంటారు.. అభిమానులు వెంటనే ఫాలో అయిపోయేలా. కానీ పవన్‌ ఇప్పుడు డీ గ్లామరైజ్డ్‌ అవతారంలో తిరుగుతున్నాడు. అయినా కానీ తనని చూడాలనే వారికి ఇవేమీ అడ్డు కావు. పవన్‌ క్రేజ్‌లో కాస్త కూడా మార్పు లేదు.

బెంగళూరులో ఒక జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేస్తున్నాడనేది అభిమానులకి తెలిసిపోయింది. దాంతో ఆ జిమ్‌ వద్ద పొద్దున్నుంచీ సాయంత్రం వరకు జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడిపోతున్నారు. పవన్‌ లోన వున్నాడని తెలిస్తే ఇక ఆ రోడ్‌ మొత్తం జామ్‌ అయిపోవాల్సిందే. మెట్లు దిగి సరాసరి కారులోకి దూకేస్తున్న పవన్‌కళ్యాణ్‌ని దూరం నుంచి అయినా చూడాలని అభిమానులు బారులు తీరిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English