ఎన్టీఆర్‌ సినిమా టివిల్లోనే చూశారేటి??

ఎన్టీఆర్‌ సినిమా టివిల్లోనే చూశారేటి??

ఒక్కోసారి అంతే.. అసలు న్యూస్‌ బయటకు రాక ముందే వాటి గురించి కొన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. ఇంతవరకు ఓ రెండు రోజుల క్రితం టివిల్లో వచ్చిన ‘‘టెంపర్‌’’ తాలూకు టిఆర్‌పి రేటింగ్‌ ఎంత వచ్చిందో రేటింగ్స్‌ చెప్పే ఏ సంస్థ కూడా చెప్పలేదు. కాని ఎవరో ఈ సినిమా టైములో 26 టిఆర్‌పి వచ్చింది.. అని చెప్పడంతో బండ్ల గణేష్‌ దాని గురించి గొప్పగా చెబుతున్నాడు.

ఇప్పటివరకు గబ్బర్‌ సింగ్‌ కు హయ్యస్ట్‌గా 24 వచ్చింది. మగధీర వంటి సినిమాకు 21.5 టిఆర్‌పీయే. అయితే టెంపర్‌ సినిమాకు బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ రాకుండా ఇలా టిఆర్‌పి ఎక్కువొచ్చిందంటే దానిని ఏమనాలి గణేషా? చాలామంది ప్రేక్షకులు ధియేటర్స్‌లోనే కాకుండా ఇంట్లోనే చూశారు సినిమాను అని చెప్పాలి. కరక్టేగా.. సినిమాకు బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చిన షేర్‌ 43.1 కోట్లే వచ్చింది. ఇప్పుడు టిఆర్‌పిలు షేర్‌ చేస్తున్న నిర్మాత అప్పుడు హిట్‌ టాక్‌ను ప్రొడక్టివ్‌గా ఎందుకు మార్చుకోలేకపోయాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు