ముందు భాయ్‌.. వెనుక కొలవెరి

ముందు భాయ్‌.. వెనుక కొలవెరి

‘‘బాహుబలి'' సినిమా కోసం మన మహేష్‌ బాబు అంటే సైడ్‌ ఇస్తున్నాడు కాని, మిగిలిన పెద్దోళ్ళు అంత ఈజీగా సైడ్‌ ఇస్తారా? మన తెలుగులో కావాలంటే ఏ సినిమానైనా ఏదోలా రిక్వెస్ట్‌ చేసి హోల్డ్‌ చేయొచ్చు.. కాని వేరే సర్క్యూట్స్‌లో కష్టమే. సరిగ్గా ఇప్పుడు ‘‘బాహుబలి''కి హిందీ, తమిళంలో అదే ఫిట్టింగ్‌ పెట్టేశారు.

ఇక్కడ శ్రీమంతుడు తప్పుకున్నా.. బాహుబలి వచ్చిన వారానికి హిందీలో సల్మాన్‌ ఖాన్‌ ‘‘బజరంగీ భాయ్‌జాన్‌''తో వస్తుంటే, పక్కనే కొలవెరి డి అన్నట్లు ధనుష్‌ తమిళంలో ‘‘మారీ'' సినిమాతో దండయాత్ర చేస్తున్నాడు. వీలైతే శింబు కూడా ‘‘వాలూ'' సినిమాతో ఓ హ్యాండ్‌ వేస్తాడట. మనోళ్లు జూలై 10న వస్తుంటే వీళ్లందరూ 17న వస్తున్నారు. అంటే కరెక్టుగా రాజమౌళి మ్యాజిక్‌కు ఓ వారం టైమిచ్చారు. చూద్దాం మనోడు ఏం చేస్తాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు