ఒకే రోజున కొట్టేసుకుంటారట బాబోయ్‌

ఒకే రోజున కొట్టేసుకుంటారట బాబోయ్‌

ఇన్నాళ్లూ ఏం చేశారూ?? అబ్బే ఎవ్వరికీ తెలియదు. అల్లరి నరేష్‌ ‘‘జేమ్స్‌ బాండ్‌’’ ఎప్పుడో రెడీ అయ్యింది. సందీప్‌ కిషన్‌ ‘‘టైగర్‌’’ మూడు నెలల నుండి బాక్సుల్లోనే ఉంది. నాగశౌర్య ‘‘జాదూగాడు’’ డేట్‌ ఎతుక్కోలేక కన్ఫ్యూజన్‌లో ఉంది. ఇన్నాళ్ళూ డేట్‌ కనపడని వీళ్లందరికీ ఇప్పుడు సడన్‌గా ఓ నెంబర్‌ కళ్లముందు కోహినూర్‌ డైమండ్‌లా వెలిగిపోయింది.

జూన్‌ 26న సోలోగా వద్దామని రుద్రమదేవి ఫిక్స్‌ చేసుకుంటే.. వీరందరూ కూడా అప్పుడే వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల కోసం కొట్టేసుకుంటారట. ఇదేమన్నా రగ్బీనా, వ్రెజ్లింగా? కలేసి మెలేసి కొట్టేసుకోవడానికి.. ఒక పెద్ద హిస్టారికల్‌ సినిమాను సోలోగా వదిలేసుంటే బాగుండేది. కాని దాని పక్కనే వస్తున్నామంటే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనేమో ఈ బాబులందరూ అదే డేట్‌ను ఖాయం చేసుకున్నారు. ఒక్క జూలై నెల వదిలేసుంటే ఆగస్టు నుండి బాక్సాఫీస్‌ ఖాళీయాగే బాబులూ.. ఆగలేకపోయారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు