మంచు విష్ణు పెద్ద రిస్కే చేస్తున్నాడు

మంచు విష్ణు పెద్ద రిస్కే చేస్తున్నాడు

మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప కథ' చిత్రం తెరక్కెనుందనే వార్త సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని విష్ణు స్వీయ నిర్మాణంలో చేయబోతున్నాడు. దీనికి ఒక హాలీవుడ్‌ కంపెనీ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరుతుంది. భక్త కన్నప్ప కథతో సునీల్‌ హీరోగా తనికెళ్ల భరణి ఈ చిత్రం తీయాలని అనుకున్నారు. అయితే సునీల్‌ ఈ చిత్రాన్ని వదులుకుని కమర్షియల్‌ చిత్రాలు చేసుకుంటున్నాడు. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్‌ లేక భారీ విజయం కోసం చూస్తున్న విష్ణు కమర్షియల్‌ పంథా వీడి ఈ చిత్రం చేయడానికి ముందుకి రావడం పెద్ద రిస్కే అనాలి.

తనికెళ్ల భరణికి ఒక భారీ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన అనుభవం లేదు. ఈ కాలంలో భక్త కన్నప్ప కథకి ఎలాంటి ఆదరణ ఉంటుందనేది కూడా సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన చూస్తేనే కానీ తెలీదు. ఓ విధంగా ఇది విష్ణు తీసుకుంటోన్న పెద్ద గ్యాంబుల్‌ అనిపిస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న డైనమైట్‌తో ఢీ స్థాయి హిట్‌ కొడతాననే ధీమాతో ఉన్న విష్ణు ఆ ధైర్యంతోనే దీనిని ఫాలో అప్‌ సినిమాగా చేస్తున్నాడేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English