‘నితిన్‌ దగ్గర డబ్బులు లేవు’ - ఛార్మి

‘నితిన్‌ దగ్గర డబ్బులు లేవు’ - ఛార్మి

కేవలం హీరోయిన్‌ ఛార్మి కొ`ప్రొడ్యూసర్‌గా రావడం వలనే నితిన్‌ బాబు తాను చేయాల్సిన పూరి జగన్‌ సినిమా నుండి తప్పుకున్నాడని ఓ రూమర్‌ నిప్పులా అంటుకుంది. ఇందులో నిజమెంతో తెలియదుకాని, ఛార్మి ఈ మధ్యన పూరి జగన్‌తో బాగా క్లోజ్‌గా ఉండటంతో అందరూ నిజమే అనుకున్నారు. కాని ఛార్మి ఏమంటుందో తెలుసా? ‘‘అసలు నాకూ నితిన్‌ సినిమాకూ సంబంధం ఏంటి? ఆ సినిమాను ప్రొడ్యూస్‌ చేయడానికి నితిన్‌ దగ్గర డబ్బులు లేవు.. సో, సినిమా ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ అఖిల్‌ సినిమాకు పెట్టేయడం వలనే ఈ సినిమా మొదలు కాలేదు. దానికి నేనెలా బాధ్యురాలిని??’’ అంటూ ప్రశ్నించింది ఛార్మి. ‘‘నితిన్‌ చేయలేదు కాబట్టి, వెంటనే పూరి మరో హీరోతో మరో ప్రొడ్యూసర్‌తో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. ఇక పూరితో నా రిలేషన్‌.. కేవలం ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. వారితో ఆయన ఎంతో క్లోజ్‌గా ఉంటారు’’ అంటూ ముగించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English