అచ్చరాలా ఎనభై కోట్లు ప్రాఫిట్‌!

అచ్చరాలా ఎనభై కోట్లు ప్రాఫిట్‌!

ఒక సినిమాపై ఎనభై కోట్ల లాభం రావాలంటే అది ఎంత పెద్ద హిట్టవ్వాలో చెప్పండి. బడా సూపర్‌స్టార్‌ ఉన్నా కానీ అంత లాభం రావడానికి స్కోప్‌ తక్కువే. చాలా మంది నిర్మాతలు తమ పెట్టుబడి వెనక్కి వచ్చేస్తే అదే పది వేలు అనేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక చిన్న చిత్రానికి నిర్మాత ఎనభై కోట్ల లాభం కళ్లచూసాడు. పబ్లిసిటీతో కలిపి ముప్పయ్‌ కోట్ల వ్యయంతో రూపొందిన 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రం థియేట్రికల్‌ షేర్‌ పరంగా డెబ్బయ్‌ రెండు కోట్లు ఆర్జించింది.

ఇక డివిడి, శాటిలైట్‌ వగైరా హక్కులతో వచ్చిన రాబడితో ఈ చిత్రానికి మొత్తం నూట పది కోట్ల వరకు వసూలయ్యాయి. పెట్టుబడి తీసేస్తే ఎనభై కోట్ల లాభం అన్నమాట. రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా ఈచిత్రం పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయి కూర్చుంది. ఈ చిత్రం హిట్‌ అవుతుందని అనుకున్నారే కానీ ఈ స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కంగన రనౌత్‌కి ఇప్పుడున్న ఫాలోయింగ్‌ చూసి ఆమె కత్తి బత్తి చిత్రాన్ని భారీ రేట్లకి కొనేయాలని చాలా మంది పోటీలు పడుతున్నారు. హీరోయిన్లలో మెగాస్టార్‌ మాదిరిగా ఇప్పుడు డిమాండ్‌ తెచ్చుకుంది కంగన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు