అల్లరి నరేష్‌ భలే పట్టాడు

అల్లరి నరేష్‌ భలే పట్టాడు

అల్లరి నరేష్‌ ఈమధ్య కాలంలో వరుసగా ఫ్లాపులిస్తున్నా కానీ అతని తాజా చిత్రం 'జేమ్స్‌బాండ్‌.. నేను కాదు నా పెళ్లాం' మాత్రం ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. కొరియన్‌ సినిమా 'మై వైఫ్‌ ఈజ్‌ ఏ గ్యాంగ్‌స్టర్‌'కి ఈ చిత్రం కాపీ అనే ప్రచారం జరుగుతోంది. పోస్టర్ల దగ్గర్నుంచి ట్రెయిలర్‌ వరకు అన్నీ ఫన్నీగా ఉండడంతో మళ్లీ అల్లరి నరేష్‌ సినిమాకెళ్లి నవ్వుకుని రావడం గ్యారెంటీ అనే భరోసా కలుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేస్తారనే దానిపైనే కొన్ని సందేహాలు కలిగాయి.

రాబోయే రోజుల్లో అన్నీ పెద్ద సినిమాలే వస్తున్నాయి. వాటి మధ్య పడితే ఈ చిత్రం నలిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర దీనిని తెలివిగా ఈ నెల 26న విడుదల చేస్తున్నాడు. బాహుబలి వచ్చేలోగా రెండు వారాల సమయం ఉంటుంది కనుక ఈ చిత్రం గట్టెక్కిపోవడానికి ఛాన్సులు చాలా ఉన్నాయి. బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్న అల్లరి నరేష్‌కి ఈసారి అన్నీ బాగా కుదిరాయి. ఇక సినిమా కాస్త డీసెంట్‌గా ఉందంటే మళ్లీ బండి పట్టాలెక్కేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు