ఆవిడకు 1 కోటి.. బాహుబలికి 1 కోటి

ఆవిడకు 1 కోటి.. బాహుబలికి 1 కోటి

‘కోటి’.. అక్షరాలా 100 లకారాలు.. కాని ఈ పదం బయట బాగా పెద్దగా వినిపిస్తుందేమో, సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాదు. హిట్టయిన హీరోయిన్‌, క్లిక్కయిన కమెడియన్‌, కథతో పాటు కాంబినేషన్‌ సెట్‌ చేసే రైటర్‌.. అందరూ ఈ ‘కోటి’నే అడుగుతున్నారు.

ఈరోజు ఈ కోటి టాపిక్‌తో ఇద్దరు డిస్కషన్స్‌లోకి వచ్చారు. ఇంకా బాలీవుడ్‌లో రెండో హిట్‌ కూడా కొట్టని హీరోయిన్‌ కృతిసేనన్‌ ఓ బ్రాండ్‌ దగ్గర నుండి అంబాసిడర్‌గా సంతకం పెట్టి 1 కోటి నొక్కేసింది. చూస్కోమ్మా పాపా అదేం మ్యాగీ కాదు కదా?? అలాగే వివిధ బాషల్లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయబడిన బాహుబలి ట్రైలర్లు మొత్తంగా కలుపుకొని కోటి క్లిక్స్‌ సాధించాయి. చూడండి సారూ, మళ్ళీ స్పామ్‌ అంటూ యుట్యూబ్‌ వారు తీసేస్తారేమో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు