శృతిమించిన శృతి హాసన్‌!!!

శృతిమించిన శృతి హాసన్‌!!!

ఎవరైనా హీరోయిన్‌ బయటకు వచ్చి నిజాలు చెప్పేసినా మనోళ్లు పెద్దగా షాకవ్వరు కాని, అదే హీరోయిన్‌ కురచ బట్టల్లో రెచ్చిపోతే మాత్రం అందరూ కళ్ళు తేలేస్తారు. మొదటి సినిమాలోనే బికినీలో ఎంట్రీ ఇచ్చి దంచికొట్టిన శృతిహాసన్‌, ఇప్పుడు ఇంకా ఘాటుగా రెచ్చిపోయింది.

ప్రస్తుతం హిందీలో ఒక సినిమా, తెలుగులో మూడు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్న శృతి, ఒక్కసారిగా సీమటపాకాయ్‌లా మారిపోయి, హాట్‌ హాట్‌ పోజులతో గ్లామర్‌కు కొత్త అర్ధం చెప్పింది. మాగ్జిమ్‌ మ్యాగజైన్‌ కోసం పొట్టి పొట్టి అంగవస్త్రాలతో దర్శనమిచ్చిన ఈ తమిళ బ్యూటి, కేవలంలో బాలీవుడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చెయ్యడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయినాసరే మన స్టార్‌ హీరోయిన్లు ఎవ్వరూ ఇప్పటివరకు రెచ్చిపోనంత రేంజ్‌లో తన ఒంపులను చూపించింది శృతి. స్టార్‌డమ్‌పై ఎంత మోజు ఉంటే మాత్రం ఇంతలా బరితెగించాలా అంటున్నారు ఈమె తండ్రి కమల్‌ హాసన్‌ అభిమానులు.