హీరో రామ్ డేరింగ్… కులంపై సంచలన ట్వీట్

బెజవాడలో కోవిడ్ ట్రీట్ మెంట్ సెంటర్ కొనసాగుతున్న స్వర్ణ పాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం… క్రమంగా కుల జాడ్యంగా మారిపోతున్న వైనం ఆసక్తికరంగా మారింది. రమేశ్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ ఓ కులానికి చెందిన వారని, ఆయన పేరు చివరన చౌదరిని చేరుస్తూ పలు పత్రికల్లో కథనాలు వస్తున్న వైనమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఇలాంటి తరుణంలో రమేశ్ సోదరుడి కుమారుడు హీరో రామ్… ఇటీవలే ఓ సంచలన ట్వీట్ ను చేయగా… దానిపై పోలీసులు ఒకింత వేగంగానే స్పందించారు. అయితే తాజాగా సోమవారం సాయంత్రం కూడా రామ్ మరో సంచలన ట్వీట్ ను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి మరింత సంచలన రేపారు.

కులాన్ని కరోనాతో పోల్చిన రామ్… కరోనా వైరస్ కన్నా కులమనే రోగమే వేగంగా విస్తరిస్తున్నదని, దీనికి అందరూ దూరంగా ఉండాలంటూ రామ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కులాన్ని ఏకంగా ఓ రోగంగా అభివర్ణించిన రామ్… దానిని అంటువ్యాధిగా పోల్చారు. అంతేకాకుండా కరోనా కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా కూడా రామ్ కులాన్ని అభివర్ణించారు. అంతటితో ఆగని రామ్… కులాన్ని వేగంగా విస్తరిస్తున్న వారికి దూరంగా ఉండాలని కూడా ప్రజలకు విజ్ఝప్తి చేశారు. అంతేకాకుండా ఈ కుల జాడ్యాన్ని కొందరు బలవంతంగా మనలోకి ఎక్కిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా యత్నాలను అడ్డుకునేందుకు అందరూ ఏకంగా ఉండాలని కూడా రామ్ పిలుపునిచ్చారు.

ప్రజలను సోదర సోదరీమణులుగా వ్యాఖ్యానించిన రామ్… కరోనా కష్ట కాలంలో కూడా కుల జాడ్యాన్ని పెంచి పోషిస్తున్న వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగానే అతడి ట్వీట్ చూస్తేనే అర్థమైపోతోంది. కులాన్ని ఓ వ్యాధిగా చెప్పిన రామ్… ఈ వ్యాధి కరోనా వైరస్ కన్నా కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని, కరోనా కన్నా కూడా డేంజర్ వ్యాధి అని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య వృత్తిలో ఉన్న తన బాబాయ్ రమేశ్ కు కులం ఆపాదిస్తూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలు, కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగానే రామ్ ఈ తరహా సంచలన ట్వీట్ ను వదిలినట్టుగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ ట్వీట్ కంటే ముందుగా వచ్చిన ట్వీట్ పై పోలీసులు స్పందించగా… తాజా ట్వీట్ ను రామ్ ఏ మాత్రం విమర్శలకు తావు లేని విధంగా, ఎంతమాత్రం వివాదాస్పదం కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ట్వీటినట్లుగా కూడా చర్చలు సాగుతున్నాయి.