నరేంద్రమోడీ కొత్త రికార్డు… !

నరేంద్ర మోడీ కొత్త రికార్డు నమోదు చేశారు. నేటితో అత్యధిక కాలం కొనసాగిన కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకు వాజ్ పాయి మీద ఆ రికార్డు ఉండేది. నేటితో మోడీకి ఆ క్రెడిట్ దక్కింది. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి మూడు సార్లు ప్రధాని అయినా… రోజుల లెక్కన వాజ్ పాయి ప్రధానిగా 2268 రోజులు మాత్రమే ఉన్నారు. ఇపుడు ఆ రికార్డు మోడీ కి దక్కింది.

భారతదేశానికి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ లు అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానులు. నాలుగో స్థానంలో మోడీ నిలిచారు. భారతదేశంపు 14వ ప్రధానమంత్రి అయిన మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు. తర్వాత రెండో సారి సంపూర్ణ మెజారిటీతో గెలిచి 2019, మే 30 ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏలిన వ్యక్తిగా చెప్పొచ్చు. బహుశా ఆ రికార్డు చెరిగిపోవడం చాలా కాష్టం. నెహ్రూ స్వతంత్ర సమర యోధుడు. అంతేకాదు అప్పట్లో వేరే పార్టీ లేకపోవడంతో ఆయనే మళ్లీ మళ్లీ ఎన్నికవుతూ వచ్చారు. ఆయన మొత్తం 17 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు.

ఆయన కూతురు ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా కొనసాగారు. అర్ధంతరంగా హత్యకు గురవడంతో ఆమె తండ్రి నెహ్రు రికార్డును అధిగమించలేకపోయారు. ఇందిర భారతదేశపు వ్యూహాత్మక ప్రధానిగా చెప్పొచ్చు. దేశానికి దిశానిర్ధేశం చేశారు. దేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మన దేశానికి అటు ఇటు ఉన్న పాకిస్తాన్ ను విడగొట్టి దేశానికి ఎంతో మేలు చేశారు. బంగ్లాదేశ్ (తూర్పు పాకిస్తాన్) ఇప్పటికీ అలాగే కొనసాగి ఉంటే దేశంతో ఎన్నో విధ్వంసాలకు గురయ్యేది.