సమీక్ష..సర్కారు వారి పాట

2.5/5

2 hour 35 mins   |   Action - Drama   |   12-05-2022


Cast - Mahesh Babu, Keerthy Suresh, Samuthirakani, Vennela Kishore, Tanikella Bharani, Nadhiya and others

Director - Parasuram Petla

Producer - Naveen Yerneni, Y Ravi Shankar, Ram Achanta, Gopi Achanta

Banner - Mythri Movie Makers, 14 Reels Plus, GMB Entertainments

Music - S Thaman

దాదాపు రెండేళ్లకు పైగా గ్యాప్ తరువాత హీరో మహేష్ బాబు సినిమా వచ్చింది. గీత గోవిందం లాంటి హిట్ తరువాత పరుశురామ్ డైరక్షన్ లో సినిమా. ఇలాంటి కాంబినేషన్ అంటే సహఙంగానే అంచనాలు ఓ రేంఙ్ లో వుంటాయి. వున్నాయి కూడా. అయితే ఈ అంచనాలు ఏ తరహా అంచనాలు అన్నది అంచనా వేయడంలోనే దర్శకుడు పరుశురామ్ విఫలమయ్యారు. మహేష్ స్టార్ డమ్ కు సరిపడా సీన్లు అల్లుకోవడం పరుశురామ్ కు వీలు కాలేదు. మహేష్ ను కొత్తగా ప్రెఙెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు కానీ సీన్లు కొత్తగా రాసుకోలేకపోయారు. ఇటు మహేష్ బ్రాండ్ సినిమా కాదు. అటు పరుశురామ్ స్టయిల్ ఎమోషన్ కాదు. అదే సర్కారు వారి పాట సినిమతో కీలక సమస్య.

సర్కారు వారి పాటలో కోర్ పాయింట్ ఏమిటంటే…బ్యాంకులు బడాబాబుల్ని వదిలేసి, సామాన్యుల దగ్గర బాకీలు వసూలు చేస్తూ, ఆ క్రమంలో వారిని దారుణంగా పీడిస్తున్న వ్యవహారం సరికాదు అన్నది. దాని కోసం కథ రాసుకోవడం కోసం రకరకాల బిట్లు బిట్లు కలిపి కథ అల్లారు. హీరో మహేష్ తల్లి తండ్రులు అతడి చిన్న తనంలోనే బ్యాంక్ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. పెరిగి పెద్దయిన హీరో అమెరికాలో అక్కడి ఙనాలకు అప్పులు ఇచ్చే ఫైనాన్స్ సంస్థ పెడతాడు. హీరోయిన్ కళావతి (కీర్తి) కేసినోలు, మందుకు అలవాటు పడి, అబద్దాలు చెప్పి హీరో దగ్గర అప్పు చేస్తుంది. కానీ ఆ అప్పు ఎగ్గొట్టడంతో హీరో ఇండియా వచ్చి, హీరోయిన్ తండ్రి (సముద్రఖని)ని ఢీకొంటాడు. బ్యాంకులకు అతగాడు పది వేల కోట్లు ఎగ్గొట్టాడు అని తెలిసి ఆ వసూలుకు ఉద్యమిస్తాడు. ఈ క్రమంలో ఙనాలను చైతన్యం చేస్తాడు. ఆ తరువాత ఏం ఙరిగింది అన్నది మిగలిన కథ.

అసలు బేసిక్ గా కథ, పాత్రలు సింక్ కావు. కథకు సరిపడా బలమైన సీన్లు లేవు. ఇదే సర్కారు వారి పాటలో కీలక సమస్య. తండ్రి అప్పు తీర్చలేక చనిపోతాడు. కొడుకు అప్పులు ఇచ్చే కంపెనీ పెట్టి, తన్ని, కొట్టి, కాల్చి మరీ డబ్బులు వసూలు చేస్తుంటాడు. తన అప్పు కోసం ఇండియా వచ్చి రౌడీలను తంతాడు. కానీ అలాంటి అప్పులు వసూలు చేసే రికవరీ బ్యాచ్ ను తప్పు పట్టి, తరిమి తరిమి కొడతాడు. ఇక్కడ హీరో క్యారెక్టరైఙేషన్ కు, కథకు సింక్ ఎలా అవుతుంది. హీరోయిన్ అప్పు ఎగ్గొడుతుంది. తండ్రిని కూడా బాకీ తీర్చవద్దు. కాలు తీసేయ్ హీరోది అని అంటుంది. కానీ తండ్రి పదివేల కోట్లు బ్యాంక్ కు బాకీ వున్నాడని తెలిసి చటుక్కున మంచిగా మారిపోతుంది. ఇదెక్కడి సింక్?

సరే కథకు లాఙిక్ లు అక్కరలేదు అనుకుని సినిమా చూద్దాం. తొలిసగం బాగానే వుంది కొంత వరకు అనే విధంగా మార్కులు పడతాయి. కానీ తొలిసగంలో కూడా సీన్లను స్మూత్ గా ఫినిష్ చేసినట్లు కానీ చెక్కినట్లు కానీ అనిపించదు. కొన్ని సీన్లు హడవుడిగా కట్ చేసినట్లు అనిపిస్తుంది. కథ ఇంకా చాలా వుంది. త్వరగా ఈ సీన్లు కానిచ్చేస్తే ఆ ఙానర్ లోకి సినిమాను పంపాలి అనే ఆలోచనతో తీసినట్లు వుంటుంది. మహేష్-వెన్నెల కిషోర్-కీర్తి ల మధ్య నడిచే కొన్ని సీన్లు మాత్రమే అలరిస్తాయి. కేసినోల్లో కెీర్తి సీన్లను ఏదో అలా అలా ప్రెఙెంట్ చేయాలని చేసినట్లు వుంటుంది. ఇలా కాస్త అసంతృప్తి కలిగించినా తొలిసగం ఙస్ట్ ఓకె అనిపించుకుని పాస్ అయిపోతుంది.

సినిమా మలిసగంలోకి ప్రవేశించాక అది అటు పరుశురామ్ స్టయిల్ కాక, ఇటు మహేష్ స్టయిల్ కాక, దశాబ్దాల కిందట వచ్చిన మాస్ సినిమాలను గుర్తుకు తెస్తుంది. దర్శకుడు కొరటాల సలహా సూచనలు ఏమైనా తెరవెనుక వున్నాయా అన్న అనుమానం కలుగుతుంది. హీరో మరీ ‘రాత్రి వుంచుకుని తెల్లవారి పంపిస్తా’ అని పదే పదే హీరోయిన్ విషయంలో అనడం మరీ దర్శకుడి చీప్ టేస్ట్ గా వుంది. క్లయిమాక్స్ ఫైట్ భరత్ అనే నేనులో దుర్గామహల్ ఫైట్ ను గుర్తుకు తెస్తుంది. ద్వితీయార్థంలో సినిమా ఎక్కడి నుంచో ప్రారంభమై మరెక్కడో ముగుస్తుంది. అసలు బ్యాంక్ లు రుణాలు వసూలు చేయాలంటారో, వద్దంటారో? చిన్న వాళ్ల దగ్గర పెద్ద వాళ్ల దగ్గర సమానంగా వసూలు చేయాలంటారో, వద్దంటారో? బ్యాంక్ రుణాల విషయంలో దర్శకుడికే ఓ క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. సినిమాలో విలనిఙం ఓ లెవెల్ వుంటుందన్నట్లు ప్రారంభించి, ఆ మరుసటి సీన్ నుంచే దిగఙార్ఙడం ప్రారంభించి, చివరకు ఎక్కడికో దించేసారు.

ఇలాంటి అన్ని వ్యవహారాల వల్ల సినిమా చూస్తుంటే చూడ్డమే తప్ప, రుచించదు. తలకెక్కదు. దాంతో తెలియని అసంతృప్తి ఆవరిస్తుంది. నిఙానికి అమెరికా నుంచి వెన్నెల కిషోర్ ను కూడా తీసుకువచ్చి కొన్ని కామెడీ సీన్లు రాసుకున్నా, లేదా సత్యం రాఙేష్ ను వాడుకున్నా, ఈ రెండూ కాక వైఙాగ్ సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ రాసుకున్నా కొంత రిలీఫ్ వుండేది. కమర్షియల్ గా సినిమా పాస్ అయిపోయేది. ఇప్పుడు తొలిసగం లైట్ గా, మలి సగం ఓల్ట్ స్టయిల్ హెవీ నెరేషన్ గా మారిపోయింది.

మహేష్ తో సినిమా చేస్తూ పూరి స్టయిల్ వుండాలనుకున్నారేమో పరుశురామ్. తన చిత్తానికి సంభాషణలు రాసుకున్నారు. బొక్క, ఉచ్చ..తడిసిపోతుంది. ఆ ఇంత పొడవు మరి… వంగోపెట్టి…రాత్రి వుంచుకుని తెల్లవారి పంపిస్తాను…ఇలాంటి చెత్త పదఙాలం అంతా సెకండాఫ్ లో నిండిపోయింది. దర్శకుడి చీప్ టేస్ట్ కు మహేష్ నోరు కూడా పాడు చేసినట్లుంది. ఇటీవల కాలంలో థమన్ కు నేపథ్య సంగీతం విషయంలో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో అది కాస్త మైనస్ అవుతుంది. కళావతి పాట ఒక్కటే బాగుంది. కానీ అది కూడా చిత్రీకరణ పెద్దగా లేదు. మ..మ..మహేష్ పాట కాపీ ట్యూన్ అని ఇప్పటికే ట్రోలింగ్ ఙరిగిపోయింది. నిర్మాణ విలువలు కూడా పెద్దగా లేవు. సిఙిలు, విఙువల్స్ కొన్ని మరీ తేలిపోయాయి.

మొత్తం మీద ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సర్కారు వారి పాట సరి అయిన దిశలో సాగలేదు.

ప్లస్ పాయింట్లు

తొలిసగం

అక్కడక్కడ ఫన్

కళావతి సాంగ్

మైనస్ పాయింట్లు

సెకండాఫ్ స్క్రిప్ట్

ఫినిషింగ్ టచ్: ‘బ్యాలన్స్’షీట్ బాలేదు

Rating: 2.5/5