దిల్ రాజు వింత బేరంతో ఫ్యూజ్ లు అవుట్!

సినిమా థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మాములుగా రన్ అవుతాయనేది తెలియక పోవడంతో లాక్ డౌన్ టైంలో రిలీజ్ కానీ సినిమాల హక్కులు తీసుకోవాలని ఓటిటీ ప్లాటుఫారమ్స్ గట్టిగా ట్రై చేసాయి. నాని నటించిన సినిమా హక్కులు తీసుకుంటే మిగిలిన సినిమాల హక్కులు తీసుకోవడం ఈజీ అవుతుందని ‘వి’ హక్కుల కోసమే ప్రయత్నాలు చేసారు.

ముప్పై కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా కానీ డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ బిజినెస్ దెబ్బ తీసే పని చేయడానికి దిల్ రాజుకి మనసు రాలేదు. అయితే అదే పనిగా వెంట పడుతున్న వాళ్ళ మార్కెటింగ్ టీంకి రాజు వింత ప్రపోజల్ పెట్టాడు.

సగం సినిమా ఇస్తానని, ఆ సగం ఓటిటీ వ్యూయర్స్ ఎలాగో చూస్తారని, అయితే మిగతా సగం చూసేందుకు తహతహలాడుతూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, సినిమా థియేటర్స్ లోకి వచ్చాక క్యూ కడతారని, అలా రెండు వైపులా ప్లస్ అయ్యే డీల్ ఇదని దిల్ రాజు చెప్పడంతో వాళ్ళకి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. నిజమే మరి వి లాంటి సినిమాలు కూడా ఓటిటీ బాట పడితే ఇక సినిమా థియేటర్లకు గడ్డు కాలమే.