ఒక్క నాగం లేకపోతే...

June 21st, 2013, 06:04 PM IST
ఒక్క నాగం లేకపోతే...

ఒక్క నాగం లేకపోతే.. ఆచరణలో ఎంత చిక్కుల మయంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అర్థం అవుతోంది. నాగం జనార్దనరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలమూ ఆ పార్టీకి చెందిన దూకుడు గల సీనియర్‌ నాయకుల్లో ఒకరు. ప్రత్యేకించి.. తెలుగుదేశం పార్టీలో అవకాశం  ఉన్నంతకాలమూ.. ప్రతిపక్షాల నుంచి కేబినెట్‌ హోదా ఉన్న ప్రభుత్వ పదవి.. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నాగం జనార్దనరెడ్డి మాత్రమే ఉండేవారు. ఆ విషయంలో ఆయన అనుభవం కూడా తిరుగులేనిది. పీఏసీ ఛైర్మన్‌గా ఉంటూ ఆయన ప్రభుత్వాన్ని ఒక రేంజిలో ఇరుకున పెట్టగలిగారు కూడా!

ఓఎంసీ ` గాలి జనార్దనరెడ్డి భూముల కుంభకోణాలు వెలుగు చూడడంలో కూడా అప్పటి పీఏసీ ఛైర్మన్‌గా నిజనిర్ధరణ కమిటీ  సారధిగా నాగం పాత్ర ఎంతో ఉంది. అలాంటి నాగం జనార్దనరెడ్డి వెళ్లిపోయిన లోటు ఇప్పుడు తెలిసివస్తోందని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో నాయకులు అనుకుంటున్నారు. ఎందుకంటే.. పీఏసీ ఛైర్మన్‌ మధ్య పోటీ కోసం.. నాయకులు ఆల్మోస్ట్‌ తగాదాలు పడుతున్నారు. గతంలో రెండేళ్ల పదవీకాలం కోసం ఒక ఏడాది రేవూరి ప్రకాశ్‌రెడ్డిని.. ఒక ఏడాది కేఈ కృష్ణమూర్తిని ఆ పదవిలో ఉంచేలా చంద్రబాబునాయుడు ఓ రాజీసూత్ర నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టితో తొలి ఏడాది ముగుస్తోంది. అధినేత ఇంకా తనకు చెప్పలేదు అనే నెపం పెట్టుకుని రేవూరి ప్రకాశ్‌రెడ్డి కదల మెదలకుండా కూర్చున్నారు. చంద్రబాబు చెబితే నామినేషన్‌ వేయాలని.. కేఈ కృష్ణమూర్తి ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు నాయకుల మధ్య వైషమ్యాలు చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తోంది. అటు చంద్రబాబు మాత్రం.. ఏదీ తేల్చకుండా వెళ్లి అమెరికాలో కూర్చున్నారు. అమెరికాలో ఆయన వ్యక్తిగత పనులతో పాటూ.. పార్టీ పటిష్ట కార్యక్రమాల్లో బిజీగా తిరుగుతున్నారు. అలాంటిది ఆయన నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఇక్కడ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు.  అందుకే కాబోలు.. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నాయకులు.. పాపం.. ఒక్క నాగం లేకపోయే సరికి పార్టీ కిందా మీదా అయిపోతోందని.. అందుకే వీలైనంత మంది ఎక్కువ ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో తయారు చేసుకోవాలని కొందరు నేతలు సూచిస్తున్నారు.

TAGS : TDP, Chandrababu Naidu, Nagam , NTR Trust Bhavan, PAC Chairman
 

Related News

అమ‌ల ముహూర్తం పెట్టేసింది!

కేర‌ళ కుట్టి అమ‌లాపాల్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. త‌మిళ ద‌ర్శకుడు ...

చంద్రబాబు - యుద్ధ వ్యూహాలు

ఎన్నికలు అంటే యుద్ధమే. ప్రత్యర్థులపై పై చేయి కావడానికి ఎన్ని వ్యూహాలు ...

జగన్ మదిలో పొత్తు ఆలోచనలు?

ఒక్కోసారి అనుకోకుండా మనసులో మాట ఏదోలా బయటకు వచ్చేస్తుంటుంది. వైఎస్ఆర్ ...

మెగా హీరోలని వదిలేసాడేంటి?

 వైవిఎస్‌ చౌదరి మూడేళ్లుగా రేయ్‌ సినిమా మీదే తన దృష్టి మొత్తం పెట్టిన ...

ప్రకాష్‌రాజ్‌పై సీరియస్‌ యాక్షన్‌

 'ఆగడు' సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ని తప్పించి సోనూ సూద్‌ని తీసుకున్న ...

-