లాక్‍డౌన్‍ ఇంత బాగా ఏ హీరో వాడుకోలేదు!

బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత జాతీయ వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్‍ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. బాహుబలి విడుదలకి ముందే తదుపరి రెండు చిత్రాలను యువ దర్శకులతో ప్రభాస్‍ ఓకే చేసేసుకోవడం వల్ల బాహుబలి తర్వాత ప్లానింగ్‍కి టైమ్‍ కుదరలేదు. అప్పట్నుంచీ షూటింగ్స్తోనే బిజీగా వున్న ప్రభాస్‍కి ఈ లాక్‍ డౌన్‍ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. అందుకే వివిధ దర్శకులు చెప్పిన కథలు విని తనకు బాగా నచ్చినవి, తన పాన్‍ ఇండియా ఇమేజ్‍కి సరితూగుతాయని అనిపించినవీ ప్రభాస్‍ ఎంచుకున్నాడు.

ఈ క్రమంలో సందీప్‍ రెడ్డి వంగా, సురేందర్‍ రెడ్డి తదితరులు చెప్పిన కథలు ప్రభాస్‍కి నచ్చలేదు. నాగ్‍ అశ్విన్‍ ప్రాజెక్ట్ని సింగిల్‍ సిట్టింగ్‍లో ఓకే చేసిన ప్రభాస్‍ ‘ఆదిపురుష్‍’తో బాలీవుడ్‍లో స్ట్రెయిట్‍ సినిమా చేయాలనే లక్ష్యం కూడా చేరుకుంటున్నాడు. ఒకవేళ లాక్‍ డౌన్‍ లేనట్టయితే ప్రభాస్‍ ఈ టైమ్‍లో రాధేశ్యామ్‍ షూటింగ్‍ కోసం యూరప్‍ పరిసర ప్రాంతాల్లో వుండేవాడు. లాక్‍ డౌన్‍ వల్ల చాలా మంది దర్శకులను కలిసి, కథలు ఎంచుకునే సౌలభ్యం చిక్కింది. ఈ లాక్‍ డౌన్‍ని ఇంత ఎఫెక్టివ్‍గా వాడుకున్న మరో హీరో లేడంటే అతిశయెక్తి కాదు.