రోజుకు రూ.450కోట్లు ఖర్చు పెడుతున్నారు

రోజుకు రూ.450కోట్లు ఖర్చు పెడుతున్నారు

మీరు రోజుకు ఎంత ఖర్చు పెడతారు? ఎప్పుడైనా లెక్క వేసుకున్నారా? మహా అయితే రెండు మూడు వందలు.. లేదంటే ఐదు వందలు. కాస్త డబ్బులన్న బ్యాచ్ అయితే..వెయ్యి లేదంటే రెండు వేల రూపాయిలు... ఇంకాస్త ఆర్థికంగా బలవంతులైతే.. రోజుకు నాలుగైదు వేలు. ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక నిరుపేదలైతే రోజుకు 30రూపాయిలు కూడా ఖర్చు పెట్టలేని వారూ మన చుట్టూ చాలామందే ఉన్నారు. మనం పెట్టే ఖర్చుకు రోజూ అదే పనిగా లెక్క వేసుకోపోయినా.. పది రోజులకో.. లేదంటే నెల రోజులకో లెక్క చూసుకోవటం పరిపాటే. అనవసరంగా ఖర్చులు ఏమైనా పెడుతున్నామా? దుబారాను ఎలా తగ్గించుకోవాలి? లాంటి వాటి గురించి ఆలోచించని వారు ఉండరు.

మన సంగతి సరే.. మరి, మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందన్నది ఆలోచించామా? చాలా తక్కువ మందే అని చెప్పాలి. ఒకవేళ ఎంత ఉంటుందంటే వెంటనే జవాబు చెప్పేవారు.. వేళ్ల మీద లెక్కపొట్టొచ్చు. కానీ..  నిద్ర లేచించింది మనం వాడే పేస్టు నుంచి పడుకునే వరకు మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిలోనూ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వెళ్లే సొమ్ములు చాలానే ఉంటాయి. మరి..వాటి ఖర్చులు, లెక్కా పత్రం గురించి ఏమైనా అడగాలన్న..  ప్రశ్నించాలన్నా అసెంబ్లీ సమావేశాలకు మించిన  వేదిక మరొకటి ఉండదు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) లెక్క ప్రకారం రోజుకు ప్రభుత్వం పెట్టే ఖర్చు దాదాపు రూ.450కోట్లు. 24 గంటల సమయం గడిచే లోపు మనం పెట్టే ఖర్చు ఇన్ని వందల కోట్లు. మరి అంతలా పెడుతున్న ఖర్చు గురించిన లెక్కా పత్రాలపై మనం ఎన్నుకున్న నాయకులు ఎంతమాత్రం దృష్టిపెడుతున్నారో తెలుసు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు