భారత్ పై పాక్, చైనా బయో వార్ ?

మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలన్నీ కకావికలమవుతున్నాయి. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్…ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ను చైనా బయోవార్ లో భాగంగా తయారు చేసిందంటూ వదంతులు వచ్చాయి. అయితే, ఈ వైరస్ సహజంగానే జంతువులలో పుట్టిందని మరి కొందరు అంటున్నారు. వైరస్ సహజమైనా..కృత్రిమమైనా…జన జీవనం అతలా కుతలమవుతున్న సంగతి వాస్తవం….లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నది వాస్తవం. ఈ వైరస్ ఎపుడు అంతమవుతుందా అని మానవాళి ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా, పాక్ లు కలిసి భారత్ పై కృత్రిమ వైరస్ తో బయోవార్ కు సిద్ధమవుతోందని సంచలన కథనం వెలువడింది. భారత్‌ ను దొంగదెబ్బ కొట్టేందుకు పాక్‌-చైనా భయంకరమైన కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నాయని వెలువడిన కథనం పెను ప్రకంపనలు రేపుతోంది. భారత్ కు వ్యతిరేకంగా చైనా, పాక్ లు బయోవార్‌కు సిద్ధమయ్యాయని..ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఆస్ట్రేలియాలోని ది క్లాక్సన్ అనే వార్త సంస్థ సంచలన కథనం ప్రచురిచింది. భద్రతా నిపుణుడు ఆంథోనీ క్లాన్ దీనిపై వ్యాసం రాశారు.

భారత్ పై కుట్రకు మూడేళ్ల కాలానికి పాక్, చైనాలు రహస్య ఒప్పందం చేస్తుకున్నాయని ఆ కథనంలో వెల్లడైంది. ప్రాణాంతక ఆంత్రాక్స్‌ఏజెంట్‌ సహా, అనేక జీవాయుధ ప్రాజెక్టులకుగాను వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పాకిస్తాన్‌ మిలటరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌కు మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. క్లాక్సన్‌ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, అంటు వ్యాధులు, వాటి జీవ నియంత్రణపై వుహాన్‌ ల్యాబ్‌తో పాక్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీఈఎస్‌టీవో) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, బయోలాజికల్‌ ఏజెంట్లను బయట దేశాల్లో పరీక్షలు చేస్తున్నట్లు కథనం ప్రచురించింది. ఈ రహస్య ఆపరేషన్‌ కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోంది. బాసిల్లస్‌ తురింజి యన్సిస్‌ (బీటీ) వైరస్‌ పరీక్షలను ఆ దేశాలు విజయవంతంగా నిర్వహించాయట.

ప్యాథోజెన్‌ క్రియోషన్‌, బయో ఇన్ఫర్మేషన్‌ కోసం పాక్‌ శాస్త్రవేత్తలకు చైనా శిక్షణ ఇస్తోంది. పాక్‌ సొంతంగా వైరస్‌ డేటాబేస్‌ అభివృద్ధి చేసుకునేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందట. ఈ రహస్య ప్రాజెక్టుపై ఆరోగ్య శాఖ అజమాయిషీ లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నారట. భారత్ ను బూచిగా చూపించిన చైనా…తక్కువ ఖర్చుతో దాయాది దేశాన్ని ప్రయోగశాలగా మార్చుకుంది. ఒకవేళ కరోనా తరహాలో ఈ వైరస్ వ్యాప్తి చెందినా…తమకు నష్టం లేకుండా చైనా కుట్ర పన్నింది. ఎబోలా తరహా లో ఉండే ఈ వైరస్‌ వల్ల 25 శాతం మరణాలు సంభవించే ప్రమా దం ఉందట. కున్మింగ్‌ సదుపా యం, సరైన సురక్షిత ప్రమాణాలు లేకుండానే పాక్‌ ఈ ప్రమాదకర వైరస్‌ను పరీక్షిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.