పిల్లలు చచ్చిపోతే కానీ గేటు రాదన్నమాట

పిల్లలు చచ్చిపోతే కానీ గేటు రాదన్నమాట

మెదక్‌ జిల్లాలో స్కూల్‌ బస్సు ఘటనలో ఇరవైకు పైగా మృత్యువాత పడ్డాక సర్కారు కళ్లు తెరిచింది. ఈ దారుణ ఘోరానికి కారణమైన లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర కాపలా.. గేటు పెట్టిస్తామని.. అది కూడా వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా కాపలా గేటు కోసం సదరు గ్రామస్తులు.. చుట్టుపక్కల వారు రైల్వే అధికారులకు.. రాజకీయ నాయకులకు విన్నపాల మీద విన్నపాలు చేస్తున్నారు. వినతి పత్రాలు అందచేస్తున్నారు. కానీ.. ఇప్పటివరకు వారి గోడును ఎవరూ వినలేదు. తాజాగా స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో పెద్దఎత్తున ప్రాణాలు పోవటం.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవటంతో ఏళ్ల తరబడి రాని గేటు.. ఇప్పుడు రానుంది.

అంటే.. సమస్యల పరిష్కారానికి ఆత్మత్యాగమో లేదంటే.. ప్రాణ తర్పణమో చేస్తే కానీ ప్రజల అవసరాలు తీరవా? ఇంతమంది పసి ప్రాణాల్లో గాల్లో కలిశాక గేటు ఏర్పాటు చేస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం కానీ.. అధికారులు కానీ ముందే నిద్ర లేచి ఉంటే.. ఈ ఘోర ప్రమాదం జరగకుండా ఉండేదేమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు