+


అరె ఓ సాంబ... నోట్ చేసుకో

June 7th, 2013, 10:08 AM IST
అరె ఓ సాంబ... నోట్ చేసుకో

గబ్బర్ సింగ్ సినిమా గుర్తుంది కదా. ఆణిముత్యాలు లాంటి మాటలు వచ్చిన ప్రతిసారీ అరె... ఓ సాంబ రాసుకోరా అనటం మర్చిపోలేం. సరిగ్గా.. అలాంటి ఆణిముత్యాల్ని తలదన్నే నగ్నసత్యాన్ని మన రాష్ట్ర ఆర్థిక మంత్రిగారు ఆవిష్కరించారు. ఇందులో వాస్తవం పాళ్లు ఎంత ఉందో.. అంతకుమించిన నాటకీయతతో ఆయన రక్తి కట్టించారు. డీఎల్ రాజీనామా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం మేరకే జరిగిందని ఆనం వారు శెలవిచ్చారు. అంతవరకూ బహుచక్కగా ఉంది. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాతే ఆయన చెలరేగిపోయారు. లేకపోతే... ఆయన గురించి మనం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరమే ఉండేది కాదు.

ఇంతకీ ఆయనేమన్నారంటే.. తమ కేబినెట్ లో కొత్తవారిని తీసుకోవాలన్నా... పాతవారిని తొలగించాలన్నా అంతా ముఖ్యమంత్రి నిర్ణయమేనని చెప్పారు. ఇందులో అధిష్ఠానం నిర్ణయం కోసం చూడాల్సిన అవసరమే ఉండదని సరికొత్త విషయాన్ని ఆయన అవిష్కరించారు. ఏమైనా.. ఇలాంటి కొత్త విషయాలు చెప్పాలంటే ఆనం బ్రదర్స్ తర్వాతే. ఆనం వారు చెబితే ఎవరూ ఏం అనమనుకుంటారేమో పాపం. నిజంగా కిరణ్ కుమార్ రెడ్డికి అంత స్వేచ్ఛే ఉంటే.. వారానికి రెండుసార్లు... ఢిల్లీ వెళ్లి రావటం ఎందుకో?  ఆ విషయం గురించి కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పి పుణ్యం కట్టుకొండి ఆనం వారు.

 

Realted News

సమంతకు కేథరిన్ రూపంలో థ్రెట్!

ఇన్ని రోజులూ టాలీవుడ్ లో తిరుగు లేకుండా సాగిన సమంత ప్రస్థానానికి బ్రేక్ ...

సౌత్ సినిమాలతో భన్సాలీ బిజినెస్ టెక్నిక్!

సంజయ్ లీలా భన్సాలీ... \'హమ్ దిల్ దే చుకే సనమ్\' వంటి ఎవరిగ్రీన్ హిట్ తో ఆపై ...

ప్రియమణి ని దాచేసిన షారూక్!

అవకాశాలు అంతగా లేకపోవడంతో ఒక్కపైసా కూడా తీసుకోకుండా ఐటమ్ నంబర్ చేసిన ...

కేకే కేసీఆర్ రబ్బర్ స్టాంపా?

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అందరికీ తెలుసు. కేసీఆర్ పొగడ్త కూడా ...

అరెరే.. వాళ్లకు కూడా తెలంగాణ కావాలట

కొందరు కొన్ని మాటలు మాట్లాడితే జోకుల్లా ఉంటాయి. వారెంత సీరియస్ గా ...



Popular - This Week

-