జానతనంతో బండిలాగిస్తున్నజానారెడ్డి..!

జానతనంతో బండిలాగిస్తున్నజానారెడ్డి..!

తెలుగు పొలిటీషియన్లలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ జానారెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మోస్ట్ సీనియర్ గా ఉన్న జానారెడ్డి పలికే కొన్ని డైలాగ్స్ కు బాగా ప్రాచూర్యం వస్తుంది. గతంలో ఈయన హోం మంత్రిగా ఉన్నప్పుడు "చట్టం తన పని తాను చేసుకుపోతుంది...'' అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో జరిగిన కొన్ని వ్యవహారాల్లో హోంమంత్రిగా జానా స్పందనను మీడియా అడగడం ఆలస్యం...సింగిల్ డైలాగ్ తో జానా అందరికీ సమాధానం ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ డైలాగ్ చాలా మందికి ఉపయోగకరంగా మారింది. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు..తమపై వచ్చే ఆరోపణల్లో ఈ డైలాగ్ నే వినిపించారు. కొన్ని సినిమాల్లో కూడా ఈ డైలాగ్ వాడేసుకోవడం జానారెడ్డి వాక్ పటిమ ఎంత గ్రేటో అర్థం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా ఇలాంటి ప్రతిభనే చూపిస్తున్నారు జానారెడ్డి. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతగా ఆయన ఇచ్చే సమాధానాలు భలే ఉంటున్నాయి.

తాజాగా ఢిల్లీలో ఉన్న ఆయన తెలంగాణ విషయం గురించి మాట్లాడుతూ..."అదొక నిరంతర ప్రక్రియ''అనే బలమైనడైలాగ్ ఒకటి విసిరారు! మరి ఈ నిరంతర ప్రక్రియకు అంతం అనేది ఉందో లేదో కూడా ఆయన చెప్పలేదు. అలాగే ఢిల్లీ పర్యటన గురించి ఆయన వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ అంశం గురించి కాక, ఫిర్యాదులు చేసేందుకు కాక..పంచాయతీ ఎన్నికల విషయంలో ఢిల్లీకి వచ్చానని అన్నారు! మరి మంత్రిగారు తన శాఖాపరమైన బాధ్యతల గురించి ఆజాద్ తో చర్చించేది ఏముంటోందో అనే అనుమానం మనకు రాకూడదు! ఒకవైపు మిగతా వారంతా తెలంగాణ విషయంలో జానారెడ్డి బాధ్యతలు పెడుతుంటే...జానా మాత్రం చాలా లౌక్యంతో బండిని లాక్కొస్తున్నారు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు