గ్రేటర్ లో జగన్ ఖాతా కూడా తెరవడట!

గ్రేటర్ లో జగన్ ఖాతా కూడా తెరవడట!

రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి మరో సర్వే వెలుగులోకి వచ్చింది. తాజాగా సెంటర్ రైట్ సర్వే పేరుతో రాష్ట్ర పోలింగ్ పల్స్ విడుదల అయ్యింది. ఈ సర్వేలో జగన్ పార్టీకి ఒకింత షాక్ ను ఇచ్చే అంచనాలు వెలువడ్డాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఘనంగా చెప్పుకు తిరుగుతున్న జగన్ పార్టీకి ఆ అవకాశం లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. జగన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దరిదాపుల్లోకి కూడా రాలేదని అంచనావేసింది. అంతే కాదు ఈ సర్వేలో ఎన్నో అసక్తికరమైన విషయాలున్నాయి. వైఎస్సార్పీపీ పరువు ఏమైనా నిలబడేది ఉంటే అది రాయలసీమలో మాత్రమేనని సర్వే అభిప్రాయపడింది. అక్కడ ఆ పార్టీ ముప్పై స్థానాలను సొంతం చేసుకుంటుందని అంచనా.

ఆ తర్వాత కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో నిలబడుతుందని సెంటర్ రైట్ సర్వే పేర్కొంది. ఇక్కడ 35 స్థానాలతో కాంగ్రెస్, 33, 33 స్థానాలతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ లు నిలబడతాయంది. ఇక తెలంగాణ విషయంలో తొలి స్థానంలో కేసీఆర్ పార్టీ రెండో స్థానంలో తెలుగుదేశం నిలిచే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఓవరాల్ గా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నట్టుగా ఈ సర్వే ఫలితాలున్నాయి. అయితే ప్రాంతాల వారీగా విభజించినప్పుడు సీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ లుగా ఈ సర్వే చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సెగ్మెంట్ లలో వైకాపా ఒక్క చోట కూడా పరువు నిలబెట్టుకోలేదని ఈ సర్వే అభిప్రాయపడింది! తెలంగాణ విషయంలో జగన్ పార్టీకి అంతో ఇంతో ఆశలు ఉన్నది హైదరబాద్ చుట్టుపక్కల ప్రాంతాల విషయంలో మాత్రమే! ఇక్కడే ఆ పార్టీకి అంత అనుకూలమైన పరిస్థితులు లేవని సర్వే స్పష్టం చేయడం గమనార్హం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు