పేచీలతోనే పొద్దు గడిపేస్తున్నారు...!

June 4th, 2013, 07:12 PM IST
పేచీలతోనే పొద్దు గడిపేస్తున్నారు...!

ఒక గొడవ ముగిసింది అనుకుంటే మరో గొడవ రెడీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయిన సందర్భంలో అక్కడ కాంగ్రెస్ గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు ఇక ఇక్కడ ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తారని అనుకున్నారంతా. అయితే... మనోళ్లకు ఆ ఎన్నికల గెలుపు క్రెడిట్ విషయంలో గొడవ మొదలైంది. ఆ తర్వాత గతంలోలోని అసమ్మతి జ్వాలలు రగిలాయి. వాటి విషయంలో ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేయాలని..ప్రయత్నించి, ప్రయత్నించి చివరకు ఒక మంత్రివైపు విజయవంతంగా వేటు వేయగలిగితే... దానిపై జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు! డీఎల్ పై వేటు వేయడం వల్ల ముఖ్యమంత్రి సాధించిన విజయం ఏదైనా ఉంటే...అది కాస్తా ఇప్పుడు జరుగుతున్న గొడవలతో ఆయనకు మరింత పరువు నష్టం వ్యవహారంగా మారింది. పక్కాగా అధిష్టానం ఆదేశాలతోనే డీఎల్ ను పక్కకు తప్పించగలిగాడు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు అదే విషయంలో, అదే అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి!

ఇంతకన్నా దుర్మార్గపు వ్యవహారం ఇంకోటి ఉండదేమో! డీఎల్ ను తప్పించేంత శక్తి ముఖ్యమంత్రికి ఓన్ గా ఎలాగూ లేదు! ఏదో లా దాన్ని సాధించి మీసం మెలేసేంతలోనే ఇప్పుడు ముఖ్యమంత్రికి గుండు కొడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తప్పించింది డీఎల్ ను అయితే...ఎక్కువ బాధ ఇతర సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. వీరంతా తీవ్ర అసంతృప్తితో అల్లాడిపోతున్నారు. దీన్ని ఢిల్లీ వరకూ చేరుస్తున్నారు. అటు పీసీసీ చీఫ్ బొత్స, మంత్రి జానారెడ్డిలు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి పీక కోయడానికి ఢిల్లీలో కత్తులు నూరుతున్నారు! మరి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నేతలను అధిష్టానం ఎలా ఊరడించి పంపిస్తుందో, కిరణ్ నెత్తిపైకి ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతుందో!

TAGS : Congress,Kiran Kumar reddy,Jana Reddy,Botsa Satyanarayana
 

Related News

బాబు చుట్టూ త్రిమూర్తులు

రాజకీయ పార్టీలు అన్నాక, కీలక నేత, ఆయన చుట్టూ కోటరీ అన్నది మామూలే. ఇందిర, ...

బికినీ ఊసే వ‌ద్దంటున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హిందీలో రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తోంద‌ని ...

జ‌క్కన్న... ఫుల్ హ్యాపీ!!

ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ త‌న `విక్రమ‌సింహా` సినిమా ప్రచార కార్యక్రమాల ...

ఈమాట సీమాంధ్రలో చెప్పరాదూ వెంకయ్యా?

భారతీయ జనతాపార్టీయే తెలంగాణా ఆవిర్భావానికి కారణం. భారతీయ జనతాపార్టీ ...

ఎన్టీఆర్‌, పూరి... `కుమ్మేస్తా`రట‌!!

నంద‌మూరి అభిమానులు కోరుకొంటున్నది కూడా అదే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్... ...

-