దళిత సీఎం తర్వాత.. పార్టీ అధ్యక్షుడి మాటేమిటి?

దళిత సీఎం తర్వాత.. పార్టీ అధ్యక్షుడి మాటేమిటి?

అడిగే వాడు లేకపోతే.. చెప్పేవాడు చెలరేగిపోతాడన్నది టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. నరం లేని నాలుకతో ఇష్టారాజ్యంగా మాట్లాడే కేసీఆర్ వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. అదే సమయంలో తాను చెప్పే ఆదర్శాలను వీలైనంత ఆలస్యంగా చేయాలన్నది ఆయన పాలసీగా చెప్పొచ్చు. తెలంగాణ వస్తే ముఖ్యమంత్రిగా ఒక దళితుడ్ని చేస్తానంటూ దళితులకు తనకున్న ప్రేమను అలా ప్రదర్శిస్తుంటారు.


 ఎప్పుడో వచ్చే తెలంగాణ సంగతి తర్వాత... ముందు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడ్ని చేసేయొచ్చు. కనీసం ఒక టర్మ్ అయినా శాంపిల్ గా చేయొచ్చు కదా. తెలంగాణ కోసం తన తల నరుక్కోవటానికైనా సిద్ధమనే ఆయన.. తాను చెప్పేవి ఉత్త మాటలు కావని... చేతలేనని  నిరూపించుకునేందుకైనా పార్టీ అధ్యక్షుడిగా దళితుడ్ని ప్రకటిస్తే బాగుంటుంది. ఇలాంటి విషయాలు కేసీఆర్ కి అస్సలు కనిపించవు... వినిపించవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు