రాజ్ నాథ్ సీరియస్ జోక్

June 4th, 2013, 12:55 PM IST
 రాజ్ నాథ్ సీరియస్ జోక్

రాజకీయ నాయకులు వేసే జోకులు కొన్ని చాలా సీరియస్ గా ఉంటాయి. అలాంటి జోక్ ను ఒకదాన్ని హైదరాబాద్ లో వేసి  ఆయనెళ్లిపోయారు. భవిష్యత్తులో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమన్నది దాని సారాంశం. ఇందులో జోకేముందంటారా? ఓ పక్క బీజేపీతో సంబంధం మాకొద్దు బాబోయ్ అంటూ టీడీపీ  మొత్తుకుంటుంటే... వారితో మాకు జాయింట్ వెంచర్ వద్దంటూ రాజ్ నాథ్ కొత్తగా చెప్పినట్లు చెప్పుకొచ్చారు. జాతీయపార్టీ అయిన తమతో టీడీపీ లాంటి ప్రాంతీయపార్టీ అంతా కరాకండిగా చెప్పటం నచ్చలేదేమో.

ఎన్నికల్లో పొత్తు సంగతి కాదు కదా.. తమ  పక్కకు కూడా రానివ్వమని ఒకటికి రెండుసార్లు టీడీపీ తెగేసి చెప్పటం రాజ్ నాథ్ ను నొప్పించేసింది. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా టీడీపీ గురించి ఒక మాట అని పారేయండంటూ ఉచిత సలహా ఇవ్వటంతో చెలరేగిపోయిన రాజ్ నాథ్... అవసరం లేకపోయినా టీడీపీ ఊసును తన స్పీచ్ లో తీసుకొచ్చేశారు. రానున్న ఎన్నికల్లో ఏదోలా చంద్రబాబును తమతో కలుపుకోవాలని ఆరాటపడ్డ బీజేపీ నేతల ఆశలపై బాబు నీళ్లు పోసేయటం తెలిసింది. అందుకే టీడీపీతో పొత్తు తామే పెట్టుకోమన్నట్లు బిల్డప్ ఇచ్చి టీడీపీపై తమకున్న అక్కసును తీర్చేసుకున్నారు.

TAGS : TDP, BJP, Rajnadh, Chandarababu Naidu,
 

Related News

బాబు చుట్టూ త్రిమూర్తులు

రాజకీయ పార్టీలు అన్నాక, కీలక నేత, ఆయన చుట్టూ కోటరీ అన్నది మామూలే. ఇందిర, ...

బికినీ ఊసే వ‌ద్దంటున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హిందీలో రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తోంద‌ని ...

జ‌క్కన్న... ఫుల్ హ్యాపీ!!

ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ త‌న `విక్రమ‌సింహా` సినిమా ప్రచార కార్యక్రమాల ...

ఈమాట సీమాంధ్రలో చెప్పరాదూ వెంకయ్యా?

భారతీయ జనతాపార్టీయే తెలంగాణా ఆవిర్భావానికి కారణం. భారతీయ జనతాపార్టీ ...

ఎన్టీఆర్‌, పూరి... `కుమ్మేస్తా`రట‌!!

నంద‌మూరి అభిమానులు కోరుకొంటున్నది కూడా అదే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్... ...

-