బిన్ లాడెన్ ని అమరవీరుడని కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తన అసలు రూపం బయటపెట్టుకుంది. టెర్రరిస్టు దేశం అనే ఆరోపణలను నిజం చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా కీర్తించింది. స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. అంటే వాళ్లంతట వారే ప్రపంచ ఉగ్రవాదిని అమరవీరుడు అనడం అంటే ఉగ్రవాదలకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించడమే అని అర్థం.

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాపై కూడా ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలతో మా దేశంలోకి ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ చంపింది. మమ్మల్ని అణిచివేసింది, అవమానించింది అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరు పేరిట అమెరికా పది సంవత్సరాలు మమ్మల్ని దారుణంగా ఇబ్బంది పెట్టిందని ఆయన పేర్కొనడం గమనార్హం. లాడెన్ ను చంపినపుడు మేము తీవ్రంగా మదనపడ్డాం, ఆవేదన చెందాం అన్నారు ఇమ్రాన్. తాజాగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా ఇంకా స్పందించలేదు.

ప్రపంచం ఎన్నటికీ మరిచిపోలేని దారుణ మారణహోమం అయిన 9/11 కు కారణమైన ప్రపంచ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అధినాయకుడు ఒసామాబిన్ లాడెన్. అల్ ఖైదా ఉగ్రవాదాలు విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను 2001 సెప్టెంబరు 9న కూల్చివేశారు. ఈ ఘోర ప్రమాదానికి ప్రపంచం వణికి పోయింది. అమెరికా అల్లాడిపోయింది. ఈ దుర్ఘటనలో 3 వేల మంది చనిపోగా 25 వేల మంది గాయపడ్డారు. అంతేకాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడిగా కూడా పరిగణించారు. ఆరోజే అమెరికా అల్ ఖైదాను అంత చేయడానికి శపథం చేసింది.

ఇదిలా ఉండగా… గతంలో ఎన్నికల ముందు లాడెన్ ను టెర్రరిస్ట్ అనడానికి ఇమ్రాన్ ఖాన్ సంశయించారు. కానీ అతను ఒక వీరుడు అని కీర్తించడం మాత్రం ఇదే తొలిసారి. చైనా ఇండియా సరిహద్దుల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాకిస్తాన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక చైనా అండ కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, భారత్ – చైనా పోరులో భారత్ కు అమెరికా మద్దతు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాఖ్యలు కీలక పరిణామం.