టేపులతో రాజయ్య రాజ‌కీయం సఫా....!?

టేపులతో రాజయ్య రాజ‌కీయం సఫా....!?

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నా.......ముఖ్యంగా సేల్‌ఫోన్ సంభాషణలపై చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం మాట్లాడకపోయిన సాంకేతికను అడ్డం పెట్టుకుని పరువు తీసేస్తున్న నేటి రోజులలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఎన్నికలలో గెలుపోటముల మాట అటుంచి పరువే పోయే పరిస్థితి వస్తుంది.

దీనికి తాజా ఉదాహరణ వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది టి. రాజయ్య ఉదంతమే. అసలే అవినీతి ఆరోపణలతో గతంలో ఉపముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న రాజయ్య ఇప్పుడు తన సీటుకే ఎసరు తెచ్చుకుంటున్నట్లు ఉంది. ఆయన ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి రాజయ్య కొంప ముంచేలా ఉంది. ఈ ఆడియో సోషట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ మహిళతో రాజయ్య సంభాషించినట్లుగా చెబుతున్న ఆడియోను అడ్డం పెట్టుకుని రాజయ్య ప్రత్యర్దులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆడియోలో రాజయ్య మాట్లాడినట్టుగా చెబుతున్న మాటలు "నువ్వు కొంటే పులివి అన్న మాటలతో ప్రారంభమయ్యాయి."

తెలంగాణ రాష్ట్ర  స‌మితి అభ్యర్ది టి. రాజయ్య ఆ మహిళతో చేసిన    సంభాషణ ఇరుకున పెట్టేదిగా ఉంది. ఆ మహిళ పట్ల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసారు. దీంతో తనను రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసేందుకే ఈ ఆడియోను స్రుష్టించారని రాజయ్య సమర్దించుకుంటున్నారు. అయితే గతంలో కూడా రాజయ్యపై అవినీతి ఆరోపణలు, శ్రుంగారపరమైన వివాదాలు వచ్చాయి.

వీటిని ద్రుష్టిలో పెట్టుకునే రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కాని, ప్రభుత్వ కార్యక్రమాలలో కాని రాజయ్యకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వంటం లేదు. ఒక దశలో ఈ ఎన్నికలలో టిక్కెట్టు కూడాదక్కదనే ప్రచారం జరిగింది. అయినా అద్రుష్టం కలసి వచ్చి రాజయ్యకు స్టేషన్ ఘనాపూర్ టిక్కెట్లు దక్కింది.

కొత్తగా ఈ ఆడియో వివాదం వెలుగు లోకి రావడంతో స్దానికి టిఆర్ఎస్ నాయకుడు సూదుల రత్నాకర్ రెడ్డి  స్టేషన్ ఘనాపూర్ టిక్కెట్టును రాజయ్యకు ఇవ్వరాదంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో పాటు మరి కొందరు టిఆర్ఎస్ నాయకులు కూడా రాజయ్యకు టిక్కెట్టును రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. దీంతో అధిష్టానం ఆలోచన ఎలా  ఉంటుందోనని పార్టీలో చర్చ జరుగుతోంది.

మరో వైపు తనపై వచ్చిన ఆడియో ఆరోపణలు కుట్రపూరితమైనవని, ఈ ఆడియో ప్రత్యర్దుల స్రుష్టి అని రాజయ్య అంటున్నారు. ఏది నిజమో...... ఏది అబద్దమో తర్వాత తేలుతుంది కాని ప్రస్తుతానికి మాత్రం రాజయ్య
రాజకీయం అగమ్యగోచరంగానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు