మోమో చాలెంజ్.. ఇండియాలో ఎంటరైపోయిన డెత్ గేమ్

మోమో చాలెంజ్.. ఇండియాలో ఎంటరైపోయిన డెత్ గేమ్

బ్లూవేల్ మాదిరిగా ఇప్పుడు మరో టెక్ గేమ్ ప్రాణాలను తోడేస్తుంది. అదిప్పుడు భారత్‌కు వచ్చేయడంతో ఆందోళన మొదలైంది. మోమో ఛాలెంజ్‌ అనేది ప్రపంచాన్ని భయపెడుతున్న ఆట... పిల్లల ప్రాణాలను తీస్తున్న ఆట..  ఈ మోమో ఛాలెంజ్‌ ఆనవాళ్ళు భారత్ లో కూడా బయటపడ్డాయి.  పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన ఒక  కాలేజ్ విద్యార్థినికి వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లో ఈ గేమ్ ఉంది.

ఈ గేమ్ ను ఆడాలని మోమో ఛాలెంజ్‌ పంపించడమే కాకుండా, ఆ వ్యక్తి విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆమె  పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తి నుండి వచ్చిన సందేశాన్ని చూపించి ఆ నెంబర్ ను పోలీసులకు ఇచ్చిన యువతి ఫిర్యాదుతో మోమో ఛాలెంజ్‌ మన దేశంలో కూడా ప్రవేశించిందని, అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో బ్లూవేల్ తరహాలోనే ఈ ఛాలెంజ్ లో కూడా ప్రాణాంతకమైన టాస్క్ లు వుంటాయి. వాటిని కంప్లీట్ చేస్తూ పోతే చివరకు ఆత్మహత్య చేసుకునేలా ఈ ఛాలెంజ్ ప్రేరేపిస్తుంది. ఈ ఛాలెంజ్ వల్ల గతవారం అర్జెంటీనాకు చెందిన ఒక 12 ఏళ్ళ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకవేళ ఈ గేమ్ ప్రారంభించి ఆడకపోతే  వారికి భయంకరమైన చిత్రాలు, బొమ్మలు పంపుతూ భయపెడతారు. మీ వ్యక్తిగత సమాచారం, మీ వీడియోలు, ఫోటోలు మీ మొబైల్ లో ఉన్న డేటా అంతా మా చేతిలో వుంది అంటూ చెప్పిన టాస్క్ లు చెయ్యాల్సిందిగా బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నవారు ఎవరు ? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనేవి మాత్రం అంతుపట్టకుండా వున్నాయి. అయితే ఈ ఛాలెంజ్ విసురుతున్నది మాత్రం జపాన్, మెక్సికో , కొలంబియాల నుండి వస్తున్న నంబర్స్ గా గుర్తించారు.  మొదట ఫేస్ బుక్  లో ప్రారంభం అయిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు వాట్సప్ కి పాకింది. సోషల్ మీడియాలో యువత ప్రాణాలు హరించే ఈ బ్లాక్ మెయిలింగ్ డెత్ గేమ్ కి సంబంధించి ఒక భయంకరమైన పెద్ద కళ్ళు, వెడల్పాటి నోరు వున్న బొమ్మ వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు