ముంబైలో విషాదం..సెక్స్‌లో ఊపిరాడ‌క మృతి

ముంబైలో విషాదం..సెక్స్‌లో ఊపిరాడ‌క మృతి

అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్. అదే స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే...ఏదైనా ముప్పుగా మారుతుంది. ఇద్దరు దంపతుల మధ్య అపూర్వమైన కలయిక అయిన శృంగారం విష‌యంలో ఓ అనూహ్య ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఊపిరాడక ప్రియురాలు మృతి చెందింది. ఈ సంఘటన గతేడాది చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గతేడాది మార్చిలో ముంబైలోని కోలాబా ఏరియాకు వచ్చారు. టూరిస్ట్ వీసా మీద ముంబైకి వచ్చిన వారిద్దరూ.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు. 23 ఏళ్ల ప్రియుడు, 20 ఏళ్ల ప్రియురాలు ఇద్దరు కలిసి హోటల్ గదిలో శృంగారంలో పాల్గొన్నారు. అయితే శృంగారం చేస్తున్న సమయంలో ప్రియుడు.. ప్రియురాలి గొంతుపై గట్టిగా నొక్కడంతో ఆమె ఊపిరాడక మృతి చెందింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన లవర్‌ను చూసి.. హోటల్ సిబ్బందికి ప్రియుడు యాకోవ్ సమాచారం అందించాడు. పోలీసులు, సిబ్బంది కలిసి.. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ప్రియురాలి మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు తరలించారు.

అయితే, ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యులు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు ఇటీవలే ఓ నివేదిక విడుదల చేశారు. శృంగారం చేస్తున్న సమయంలో ఆమె గొంతుపై గట్టిగా నొక్కడంతోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడించారు. దీంతో ప్రియుడు యాకోవ్‌పై పోలీసులు అభియోగం నమోదు చేశారు. ప్రస్తుతం యాకోవ్ ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. శృంగారాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించాల్సింది పోయి అతిగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు