ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం విఫలం..!

ఇస్రో ప్రయోగం విఫలమైంది. జిఎస్ఎల్వి ఎఫ్ -10 రాకెట్ ను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే మూడ‌వ‌ దశలో ఈ రాకెట్ క్రయోజనిక్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో జిఎస్ఎల్వి ఎఫ్-10 మిషన్ విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ అధికారికంగా ప్రకటించారు.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జియో సింక్రోన‌స్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ ప్రయోగించేందుకు బుధవారం ఉదయం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. గురువారం ఉదయం 05:43 గంటలకు జిఎస్ఎల్వి -ఎఫ్ 10 రాకెట్ ను ప్ర‌యోగించారు. అయితే క్రయోజనిక్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య రావడంతో ఈ ప్రయోగం విఫలమైంది.

కరోనా కారణంగా దాదాపు 18 నెలలపాటు షార్‌ లో ప్రయోగాలు ఏమీ జరగలేదు. ఈనెల నుంచే మళ్లీ లాంచింగ్ కి ఏర్పాట్లు మొదలుపెట్టారు. GSLV- F10 ప్రయోగం ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. చివరకు ఫెయిల్ అయింది.