చ‌రిత్ర‌లో అత్య‌ల్పంగా హెచ్‌1బీ ద‌ర‌ఖాస్తులు

చ‌రిత్ర‌లో అత్య‌ల్పంగా హెచ్‌1బీ ద‌ర‌ఖాస్తులు

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. డాల‌ర్ డ్రీమ్స్ ఆశ‌లు ఏ ర‌కంగా నిరాశ‌జ‌నకంగా మారుతున్నాయో తెలియ‌జెప్పేందుకు తాజాగా హెచ్‌1బీ ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌నే నిద‌ర్శ‌నం అంటున్నారు. అమెరికా, ముఖ్యంగా ట్రంప్‌ ఆంక్షల నేపధ్యంలో హెచ్‌-1బీ వీసా కోసం అభ్యర్థించే భారతీయుల సంఖ్య వరుసగా రెండో ఏడాది తగ్గింది.

ఈ ఏడాది చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభ్యర్ధనల సంఖ్య 43శాతం తగ్గిందిని అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంఖ్య 2007లో అందిన 3,14,621 అప్లికేషన్ల తరువాత ఇదే అత్యల్పం. ఇంతకు ముందు ఇది 2017లో 3,99,349 అభ్యర్ధనల నుండి 3,36,107కు తగ్గింది. 2018లో ఉద్యోగాలకు దాదాపు 1.90 లక్షల హెచ్‌-1బి వీసా దరఖాస్తులు అందాయి. 2018-19 సంవత్సరం కోసం అక్టోబర్‌ 1 నుండి వీసాను ఇవ్వనున్న నేపధ్యంలో గత ఏడాదితో పోలిస్తే 8,902 అభ్యర్ధనలు తక్కువగా వచ్చాయి.

అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్‌ సంస్థ 2018-19 సంవత్సరానికి అభ్యర్ధనల కోటాను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చెయ్యనుంది. ఈ అభ్యర్ధనలు 2016-17 సంవత్సరాలకు అత్యధికంగా 2.36 లక్షలుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2, 6 తేదీల్లో అభ్యర్ధనలను ఆహ్వానించగా తగిన సంఖ్య కన్నా ఎక్కువే వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది. హెచ్‌-1బి వీసా కోసం జనరల్‌ కోటాలో పరిమితి 65వేలు కాగా, అడ్వాన్డ్‌ డిగ్రీ హోల్డర్స్‌ గా అభివర్ణించే మాస్టర్స్‌ క్యాప్‌ కోసం పరిమితి 20వేలు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ ర్యాండమ్‌ సెలక్షన్‌ (లాటరీ) పద్దతిలో ఎంపిక జరుగుతుందని సంస్థ ఏప్రిల్‌ 11న ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ప్రస్తుతం ఎంపిక కాని అభ్యర్ధనలను వారు కట్టిన ఫీజుతో పాటు తిప్పి పంపే ప్రక్రియను ప్రారంభించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు