సినీన‌టుల‌కు చేవ చ‌చ్చిందా...

సినీన‌టుల‌కు చేవ చ‌చ్చిందా...

టీడీపీ నేత‌, ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్‌ను టార్గెట్‌‌ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ మన హీరోలకు పోరాడే చేవ చచ్చిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క సినీ పరిశ్రమ తప్ప అన్ని వర్గాలు కేంద్రం చేస్తున్న అన్యాయంపై నోరు విప్పారని అన్నారు. సినీ పరిశ్రమ ఎందుకు ఆందోళనలో పాల్గొనడం లేదని ఆయన సూటిప్రశ్నవేశారు. జల్లికట్టు అంశంలో తమిళనాడు సినీ వర్గం ముందుండి నడిపించిందని, కానీ మన తెలుగు పరిశ్రమకు ఏమైందని ఆయన ఎద్దేవా చేసారు. తెలుగు పరిశ్రమకు పోరాడే చావ చచ్చిపోయిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

సోదర రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మన పోరాటానికి మద్దతునిచ్చిందని తెలిపారు. `కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత సహా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఏపీ పోరాటానికి మద్దతు పలుకుతుంటే అక్కడే ఉంటున్న టాలీవుడ్‌ పెద్దల్లో ఒక్కరూ మాట్లాడటకపోవడం శోచనీయం. తమిళ నటీనటులను చూసైనా పోరాటం చేయాలి` ని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ బానిస బతుకులు బ్రతుకుతుందని మండిప‌డ్డారు. అవార్డులు రాకపోతే నానాయగి చేసే వారు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైనా ఆంధ్రుల హక్కుల కోసం పోరాడండని, లేకపోతే సినీ పరిశ్రమను బహిష్కరిస్తామన్నారు.

రాష్ట్రం వచ్చి నాలుగేళ్లవుతున్న ఒక్క హీరో ఒక్కరోజు అమరావతిలో ఉండలేదని రాజేంద్ర‌ప్రసాద్ ఆరోపించారు. జల్లికట్టును నిషేధిస్తే తమిళ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉద్యమించిందని కానీ టాలీవుడ్‌ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  ఇకనైనా ఉద్యమించకపోతే ఐదు కోట్ల ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు