బిట్‌కాయిన్...ఊహాజనితమైన వర్చువల్ కరెన్సీ అయినప్పటికీ ప్రపంప వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి క్రిప్టో కరెన్సీపై క్రేజ్ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. ఇటు బయ్యర్ల నుంచి అటు వ్యాపారవేత్తల వరకు బిట్ కాయిన్ లాభనష్టాలు,పెట్టుబడి మార్గాలు అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు బిట్‌కాయిన్ వ్యాపారవేత్తలు విదేశాల్లోనే తమ వ్యవహారాలు చక్కదిద్దారు.కానీ మనదేశంలో బిట్ కాయిన్ బిజినెస్‌లోకి బడా వ్యాపార దిగ్గజం ఎంట్రీ ఇస్తోంది. దేశీయ టెలికం మార్కెట్లో శరవేగంగా దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించబోతున్నారు. జియోకాయిన్ పేరుతో సొంతగా క్రిప్టో (అదృశ్య) కరెన్సీని సృష్టించాలని ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న బిట్ కాయిన్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముఖేష్ అంబానీ సిద్ధమయ్యారని, ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన దాదాపు 50 మంది యువ నిపుణులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేయబోతున్నారని లైవ్‌మింట్ పత్రిక వెల్లడించింది. ఈ టీమ్‌కు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. క్రిప్టో కరెన్సీని రూపొందించడం, దానిని విక్రయించడం లాంటి అంశాలను ఈ టీమ్ పరిశీలిస్తుంది. బిట్ కాయిన్ పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల్లో అనేక మంది ఆసక్తి చూపుతుండటంతో ఈ వ్యాపారంపై జియో ఇన్ఫోకామ్ కూడా దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే జియోకాయిన్ పేరుతో సొంతగా క్రిప్టో కరెన్సీని సృష్టించాలని నిర్ణయించిందని లైవ్‌మింట్ పేర్కొన్నది.
అయితే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే పలుమార్లు పునరుద్ఘాటించడమే కాకుండా ఇందులో ఎవరూ పెట్టుబడులు పెట్టరాదని హెచ్చరించారు. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టే పెట్టుబడులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. బిట్ కాయిన్ వృద్ధికి ఇటీవల బ్రేకులు పడ్డాయి కూడా. అయినప్పటికీ...ముఖేష్ ఈ రంగంపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది.
బిట్ కాయిన్...ఇప్పుడు అంబానీల రూపంలో!
Jan 13, 2018
126 Shares
రాజకీయ వార్తలు
-
ఫర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!
Apr 19,2018
126 Shares
-
బాబు దీక్షకు సినీ మద్దతు
Apr 19,2018
126 Shares
-
ఆయన అడ్డురాకపోతే..హరిబాబుకే మంత్రి పదవి
Apr 19,2018
126 Shares
-
సీఎంపై ఫేస్బుక్లో పోస్ట్..వ్యక్తి అరెస్ట్ !
Apr 19,2018
126 Shares
-
నోట్ల కష్టాలుః హైదరాబాద్‌కు విమానంలో నగదు
Apr 19,2018
126 Shares
-
బాబే వెళ్లిపోయాడు..టార్గెట్ చేస్తామంటున్న అమిత్‌షా
Apr 18,2018
126 Shares
సినిమా వార్తలు
-
శ్రీరెడ్డిపై కరాటె కళ్యాణి సంచలన ఆరోపణలు
Apr 19,2018
126 Shares
-
60 కోట్ల లాభాన్ని నింపేసిన భరత్
Apr 19,2018
126 Shares
-
సుక్కుకి సమంత చెంపపెట్టులాంటి సమాధానం
Apr 19,2018
126 Shares
-
రామ్ గోపాల్ వర్మది కవరింగేనా?
Apr 19,2018
126 Shares
-
‘మా’కు మంచు విష్ణు పంచ్
Apr 19,2018
126 Shares
-
రెండు బ్యానర్లకు టిక్ పెట్టేశా
Apr 19,2018
126 Shares