కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ ఆలోచన గ్రేట్ కదా!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ఏడు ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌కు హాజరైన బిల్ గేట్స్… తన సంపాదనలో చాలా భాగం ధాతృత్వ పనుల కోసమే వినియోగించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడమే బిల్ గేట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీని వ్యాక్సిన్ కోసం ఏడు కంపెనీలు పెడతామని… అందులో బెస్ట్ అనుకున్న రెండు వ్యాక్సిన్లను ఫైనల్ ట్రయల్స్ కోసం తీసుకుంటామని చెప్పారు.  అంటే మిగిలిన ఐదు కంపెనీల మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వేస్ట్ కాబోతుందన్నమాట. అయితే సమయాన్ని ఆదా చేసేందుకు ఏడు కంపెనీలను నిర్మించబోతున్నట్టు… తెలిపారు గేట్స్.

ధనం కంటే సమయం ముఖ్యమని… ఆలస్యం చేస్తే వేలమంది ప్రాణాలు కోల్పోవచ్చని ఆయన  వివరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారుచేసి, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకోవడానికి ఎంత లేదన్నా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందట.

వ్యాక్సిన్ తయారుచేసి ఈ ఏడు కంపెనీల మీద ఆయన కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. దీంతో యూఎస్ ప్రభుత్వం కంటే బిల్ గేట్స్ అంకితభావం అద్భుతమని సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆపదలో అక్కరకు రాని కాసుల కంటే తిరిగిరాని కాలానికి, ప్రాణానికి విలువ ఇవ్వాలనే బిల్ గేట్స్ ఆలోచనా విధానం గ్రేట్ కదా మరి!!