జ‌గ‌న్ స్ఫూర్తితో శశిక‌ళ‌, గాలి జనార్దన్ రెడ్డి పాద‌యాత్ర‌

జ‌గ‌న్ స్ఫూర్తితో శశిక‌ళ‌, గాలి జనార్దన్ రెడ్డి పాద‌యాత్ర‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ పాద‌యాత్ర ఏపీలో పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. ప్ర‌భుత్వం ఉన్న ఎత్తిచూపేందుకు, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నార‌ని వైసీపీ ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామంపై అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు త‌మదైన శైలిలో రియాక్టవుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై విరుచుకుప‌డుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత కుంభంపాటి రామ్మోహ‌న్ జ‌గ‌న్ యాత్ర‌ను ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే పాదయాత్ర చేయాల‌ని డిమాండ్ చేశారు.

12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్ పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వ‌డాన్ని చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని కంభంపాటి రామ్మోహ‌న్ వ్యాఖ్యానించారు. జ‌గన్ స్ఫూర్తితో త‌మిళనాడులో శశికళ, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డిలు కూడా పాదయాత్రలు చేస్తార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం త‌మ‌ ఎంపీలు రాజీనామాలు చేస్తామ‌ని గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌క‌టించార‌న్న కుంభంపాటి ఆ మాట‌పై వైసీపీ ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎంపీలు ఎప్పుడు రాజీనామాలు చేస్తారో ముందు జ‌గ‌న్ ప్ర‌క‌టించాల‌ని చెప్పారు. ప్రత్యేకహోదా అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అందుకే ఎక్కువ నిధులను రాబట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం ప్ర‌తిప‌క్ష నేత‌కు అర్థం కాక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సైతం జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై మండిప‌డ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ఓ వైపు రైతులు ఆనందోత్సాహాల నడుమ వ్యవసాయ పనులు మొదలు పెడుతుంటే.. మరో వైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్ర వర్సాలు పడొద్దని నిరంతరం పూజలు చేస్తున్నారని విమర్శించారు. వర్షాలు బాగా పడి శ్రీశైలం నిండితే వైసీపీకి మండుతోందన్నారు. హోదా పేరుతో విద్యార్థులను యువభేరి సభలతో మోసం చేసేందుకు జగన్‌ యత్నిస్తున్నాడన్నారు. జగన్‌కు ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత లేనేలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పైగా ఆయన పాద‌యాత్ర‌కు సిద్ధ‌మవుతున్న తీరు చూస్తుంటే కేసుల భ‌య‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు