చాందినీ లాంటి వాళ్లంద‌రినీ ట్రాప్ చేస్తున్న ఫేస్‌బుక్ పేజ్ ఇదే!

చాందినీ లాంటి వాళ్లంద‌రినీ ట్రాప్ చేస్తున్న ఫేస్‌బుక్ పేజ్ ఇదే!

చాందినీ జైన్‌...మూడ్రోజుల కింద‌టి వ‌ర‌కు ప‌క్క‌కాల‌నీ వాళ్ల‌కు కూడా తెలియ‌ని ఈ పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆరో తరగతి నుంచే సాయికిరణ్, మదీనాగూడకు చెందిన చాందినీ జైన్ స్నేహంగా ఉన్నారు. టీనేజీకి రాగానే స్నేహితులు మరింతగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే సాయికిరణ్ చాందినీని వదిలించుకోవాలనుకొని అమీన్‌పూర్ గుట్టలో దారుణంగా హత్య చేశాడు. స్నేహితుడని నమ్మి వెళ్లడమే ఆమె చేసిన పాపం.. ఆ నమ్మకమే ఆమెను కన్పించని లోకాలకు తీసికెళ్లింది. ఈ ఘటన తాజాగా మియాపూర్‌లో జరిగింది.

ఈ ఘ‌ట‌నకు ముందు అస‌లేం జ‌రిగింద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. నగరానికి చెందిన ఓ 11వ తరగతి విద్యార్థి ఫేస్‌బుక్‌లో Third moon పేరిట పేజీ క్రియేట్ చేశాడు. సిటీలోని స్టార్ హోటళ్లలో ఇంటర్ విద్యార్థుల కోసం పార్టీలు నిర్వహిస్తు న్నట్టు పిలుపునిచ్చాడు. దీంతో హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన మైనర్లు (బాల, బాలికలు) 52 మంది స్పందించి పార్టీకి వచ్చారు.

సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో బాలబాలికలు కలిసి పార్టీ చేసుకున్నారు. మూడు రోజుల పాటు అంతాకలిసి రూమ్‌లలో బసచేశారు. రాత్రి వేళలో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో ఎంజాయ్ చేశారు. మైనర్‌లను పబ్‌లలోకి అనుమతించరని గుర్తించి ఫేక్ ఆధార్ కార్డులు రూపొందించి మరీ పబ్‌లోకి ఎంట్రీ అయ్యారు. అక్కడ మద్యం, ధూమపానంతో పాటు తదితర వయస్సుకు మించిన కార్యకలాపాలలో మునిగి తేలారు.

ఆ పార్టీలో చాందిని జైన్‌తో పాటు నిందితుడు ఎస్‌కే సైతం పాల్గొన్నారు. ఇదే తరహాలో ఈనెల 9న(శనివారం) సైతం నగరంలో పార్టీ ఏర్పాటు చేశామని కొందరు స్నేహితులు చాందినికి సమాచారం ఇవ్వగా వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఆ పార్టీ రద్దు కావడంతో స్నేహితులను కలిసివస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చాందిని ఎస్‌కేను కలిసి అమీన్‌పూర్‌కు వెళ్లింది. అక్క‌డే విగ‌తజీవిగా మారింది.

ఇలాంటి ప‌రిస్థితికి మాన‌సిక నిపుణులు ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేస్తున్నారు. తల్లిదండ్రుల కంటే స్నేహితులనే ఎక్కువగా నమ్మే పరిస్థితి నేటి సమాజంలో ఉంది. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య పెరుగుతున్న దూరంతో స్నేహితులే ఎక్కువవుతున్నారు. మరోపక్క తల్లిదండ్రులు, పాఠశాలలు, స్కూల్స్ మానవీయ విలువలు సమాజంలో జరుగుతున్న మంచి, చెడు అనే అంశాలపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ర్యాంకుల కోసం ప్రయత్నించే విద్యా సంస్థలు.. ఉద్యోగ, వ్యాపారాలలో బిజీ అయిపోతున్న తల్లిదండ్రులు ఇలా పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించడం లేదు. టీనేజీ వయస్సులో వచ్చిన పిల్లల మానసిక పరిస్ధితిని అంచనా వేస్తూ వారిని మార్చేందుకు కొందరు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ సత్ఫలితాలు రాబట్టుకుంటున్నారు. ఇందుకు పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తూ, వారిని తీర్చిదిద్దే వారు ఉన్నారు.

పిల్లలు స్నేహితులతో సరదాగా ఉంటున్నారా.. స్నేహంగా ఉంటున్నారా.. టీనేజీలో హద్దులు దాటుతున్నారా? అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇక్కడే కొన్నిసార్లు జరుగరాని ఘోరాలు జరుగుతున్నాయి. చెడు స్నేహాలు, సోషల్‌మీడియా ప్రభావంతో కొన్ని సందర్భాలలో పిల్లలు హత్యకు గురవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు