దావూద్‌.. ప్ర‌పంచంలో రెండో సంప‌న్నుడు!

దావూద్‌.. ప్ర‌పంచంలో రెండో సంప‌న్నుడు!

త‌న అండర్ వ‌ర‌ల్డ్ వ్య‌వ‌హారాల‌తో  ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తించిన డాన్ దావూద్ ఇబ్ర‌హీం! 1993 నాటి ముంబై వ‌రుస బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌కు సూత్ర‌ధారి అయిన ఈ డాన్ మూలంగా దాదాపు 300 మంది అమాయ‌క పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌ను ఎల్ల‌ప్పుడూ అస్థిర‌త‌తో ఉంచాల‌నే ధ్యేయంతో ప‌నిచేసే ఈ డాన్‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తోంది మ‌న పొరుగు దేశం, మ‌న దాయాది దేశం అదేస‌మ‌యంలో మ‌న శ‌తృదేశం పాకిస్థానే! దావూద్‌ను భార‌త్‌కు ర‌ప్పించి నాటి పేలుళ్ల కేసులో కోర్టు బోను ఎక్కించేందుకు భార‌త ప్ర‌భుత్వం చేస్తున్న ఏ ఒక్క ప్ర‌య‌త్న‌మూ ఫ‌లించ‌లేదు.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి ఈ డాన్ వార్త‌ల్లోకి ఎక్కాడు. అయితే, అది ఏదో మ‌ర్డ‌ర్ చేసో, మ‌రో బాంబు పేలుడుతోనోకాదు. త‌న ద‌గ్గ‌ర కూడ‌బెట్టిన ఆస్తుల రికార్డుల‌తో దావూద్ ఇప్పుడు వార్త‌ల్లో నిలిచాడు. ఇప్పుడు ఆయ‌న ఆస్తుల‌పై ప్ర‌పంచం నివ్వెర పోతోంది! ప్రపంచంలో అత్యంత ధనవంతులైన గ్యాంగ్‌స్టర్‌ల జాబితాలో దావూద్‌ రెండోస్థానంలో ఉన్నాడు. బ్రిటన్‌లో దావూద్‌ ఆస్తుల జప్తు నేపధ్యంలో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫోర్బ్స్‌ బిజినెస్‌ మేగజైన్‌ ఈ వివరాలు వెల్ల‌డించింది. కొకైన్‌ కింగ్‌గా పిలువబడే ఎస్కోబార్‌ మొదటి స్థానంలో ఉన్నాడు.

అమెరికాలో ఉపయోగించే డ్రగ్స్‌లో సుమారు 80శాతం ఎస్కోబార్‌ సరఫరా చేస్తాడు. డైలీన్యూస్‌ కథనం ప్రకారం 1990ల నాటికే ఎస్కోబార్‌ 30 బిలియన్ డాలర్ల విలువైన సంపదలు ఉన్నాయని సమాచారం. అతను అత్యంత సంపన్నుడైన నేరస్థుడిగా డైలీన్యూస్‌ ప్రచురించింది. దావూద్‌కు 2015నాటికి 6.7 బిలియన్‌ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయని డైలీన్యూస్‌ తెలిపింది. దీంతో దావూద్ ఈ ఆస్తుల జాబితాలో రెండో ప్లేస్ ఆక్ర‌మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు