రూ.100 నాణెం వచ్చేస్తుందా

రూ.100 నాణెం వచ్చేస్తుందా

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం భారీ స్థాయిలో  చిల్ల‌ర కొర‌త ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ కొర‌త‌ను తీర్చేందుకు కొత్త‌గా రూ.200 , రూ.50 నోట్ల‌ను ఆర్బీఐ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో త్వ‌ర‌లో రూ.100 నాణేల‌ను విడుద‌ల చేసేందుకు ఆర్థిక శాఖ రెడీ అవుతోంది.

వీటితో పాటు రూ.10, రూ.5 నాణేల‌ను కూడా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు  కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ఓ ప్రకటనను మంగ‌ళ‌వారం విడుదల చేసింది. త‌మిళ లెజెండ‌రీ హీరో ఎంజీఆర్‌, ప్ర‌ఖ్యాత క‌ర్ణాట‌క సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి 100వ‌ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రూ. 100, రూ. 5, రూ. 10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

రూ. 100 నాణెం వ్యాసం 44 మిల్లీమీటర్లుగా ఉంటుందని తెలిపింది. నాణేనికి ఒక‌వైపు నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ  ముద్రించ‌నున్న‌ట్లు చెప్పింది. నాణేనికి మ‌రోవైపు ఎంజీఆర్ బొమ్మ‌, ఎంఎస్ సుబ్బ‌లక్ష్మి బొమ్మ‌ను ముద్రించ‌బోతున్నామ‌ని తెలిసింది. కొన్ని నాణేల‌ను ఎంజీఆర్ పేరు మీద‌, మ‌రి కొన్ని నాణేల‌ను సుబ్బ‌ల‌క్ష్మి పేరు మీద విడుద‌ల చేస్తామ‌ని చెప్పింది.

35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని త‌యారు చేయడానికి వెండి, రాగి, నికెల్‌, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రూ. 10 నాణెం మీద సుబ్బుల‌క్ష్మి బొమ్మ‌ను, రూ. 5 నాణెం మీద ఎంజీఆర్ బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని వివ‌రించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు