విడాకులు ఇద్ద‌రూ అడిగితే...వెంట‌నే ఇవ్వొచ్చు

విడాకులు ఇద్ద‌రూ అడిగితే...వెంట‌నే ఇవ్వొచ్చు

విడాకుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు. కొన్నేళ్లుగా క‌లిసి ఉన్న భార్య‌భ‌ర్తలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌లిసి జీవించే అవ‌కాశం లేన‌ప్పుడు.. విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన త‌ర్వాత కూలింగ్ పీరియ‌డ్ లాంటిదేమీ అవ‌స‌రం లేద‌న్న క్లారిటీ తాజాగా ఇచ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేస్తున్న కూలింగ్ పీరియ‌డ్ ఎత్తేసి.. అవ‌స‌ర‌మైతే వారం వ్య‌వ‌ధిలోనూ విడాకులు మంజూరు చేయొచ్చ‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటూ.. విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన ఒక జంట‌.. ఆర్నెల్ల పాటు ఉన్న కూలింగ్ పీరియ‌డ్‌ను త‌మ‌కు స‌డ‌లించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసును జ‌స్టిస్ ఏకే గోయ‌ల్‌.. జ‌స్టిస్ ల‌లిత్ తో  కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

విడిపోతామంటూ కోర్టును ఆశ్ర‌యించిన భార్యాభ‌ర్త‌లు.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌లిసి ఉండే అవ‌కాశం లేన‌ప్పుడు కూలింగ్‌పీరియ‌డ్ అవ‌స‌రం లేకుండానే ట్ర‌య‌ల్ కోర్టులు విడాకులు మంజూరు చేయొచ్చని స్ప‌ష్టం చేశారు. 1955 హిందూ వివాహ చ‌ట్టం ప్ర‌కారం విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఆర్నెల్ల వ‌ర‌కూ విడాకులు ఇవ్వ‌టానికి వీల్లేద‌న్న మాట చ‌ట్టంలో ఉన్న‌ప్ప‌టికీ.. అది సూచ‌నే త‌ప్పించి త‌ప్ప‌నిస‌రి కాద‌న్న మాట‌ను చెప్పింది.

చ‌ట్టంలోని సెక్ష‌న్ 13బి(2) చెప్పేదంతా సూచ‌నే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌న్న మాటను సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణ‌యాల నుంచి కాపాడ‌టం కోస‌మే ఈ సెక్ష‌న్ త‌ప్పించి మ‌రింకేమీ కాద‌ని.. హ‌డావుడి నిర్ణ‌యాల వ‌ల్ల బ‌లి కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే కూలింగ్ పీరియ‌డ్ గా అభివ‌ర్ణిస్తున్నారు.

క‌లిసి ఉండే అవ‌కాశం ఎట్టి ప‌రిస్థితుల్లో లేని దంప‌తులు.. ఆర్నెల్ల కూలింగ్ పీరియ‌డ్‌ను త‌మ‌కు స‌డ‌లించాల‌ని కోర‌టం త‌ప్పేం కాద‌న్న అభిప్రాయాన్ని సుప్రీం ధ‌ర్మాస‌నం తాజాగా స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.  విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన వారానికే మంజూరు చేయొచ్చ‌న్న సూచ‌న‌ను చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు