​తాత వారసత్వం కొనసాగిస్తా

​తాత వారసత్వం కొనసాగిస్తా

టీఆరెస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ తీరు ఆ పార్టీని అనేక అనుమానాల్లో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోడీకి మద్దతుగా పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇచ్చిన ఆయన రీసెంటుగా బీజేపీ నేతలతోనూ భేటీ అయ్యారు. దీంతో అరవింద్ బీజేపీలో చేరడం ఖాయమన్న సంగతి తెలిసిపోయినా డీఎస్ సంగతే ఇంకా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇలాంటి సమయంలో అరవింత్ తన రూటేంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వడంతో పాటు జరుగుతున్న పరిణామాలతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. అసలు తాను ఆరేళ్ల కిందటే బీజేపీలో చేరాలనుకున్నానన్న సంగతీ చెప్పారు.

    2011లోనే బీజేపీ లో చేరాలని అనుకున్నానని.. ఇక బీజేపే తనకు ఏ పని చెప్పినా చేస్తానని అంటున్నారు. అసలు తమది బీజేపీ కుటుంబం అన్నట్లుగా ఆయన పాత కథలు చెప్పుకొచ్చారు. తన తాత జనసంఘ్ నేత అని, తాను కూడా తాత బాటలోనే వెళ్లాలని అనుకుంటున్ననని ఆయన అన్నారు.

    అయితే... బీజేపీలో చేరాలనుకుంటున్నట్లుగా తన తండ్రికి ఇంతుకముందు చెప్పలేదని..  ఇటీవలే దీనిపై సమాచారం ఇచ్చాను కానీ, ఇంకా చర్చించలేదని ఆయన అన్నారు. మోదీపై ఇచ్చిన పత్రికా ప్రకటనకు ఒక్కరోజు ముందే డీఎస్ కు ఆయన ఈ సంగతి చెప్పారట. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని... తన తండ్రి ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నారో... ఎవరి తరఫున ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆయన ఇష్టమని అరవింద్ అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు