అమెరికాను వెన‌క్కు నెట్టిన భార‌త్‌!

అమెరికాను వెన‌క్కు నెట్టిన భార‌త్‌!

ప్ర‌పంచానికే పెద్ద‌న్నలా వ్య‌వ‌హ‌రిస్తున్న అమెరికాను భార‌త్ వెన‌క్కు నెట్టేసింది. అగ్ర‌రాజ్యంతో పోటీప‌డి సోష‌ల్ మీడియాలో అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఫేస్ బుక్ లో మొత్తం 241 మిలియన్‌ మంది యాక్టివ్‌ యూజర్లతో భారత్ మొద‌టి స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మంది ఫేస్ బుక్ యాక్టివ్‌ యూజర్లుండ‌డంతో  ఆ దేశం రెండో స్థానంలో నిలిచింది.

ఫేస్‌బుక్ కు ఎక్కువ యాక్టివ్‌ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్‌ అధిగమించిందని నెక్ట్స్‌ వెబ్ పోర్ట‌ల్ గురువారం వెల్లడించింది. ఇటీవలే ఫేస్ బుక్  ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 బిలియన్‌ యూజర్ల మార్కును చేరుకుంది. త‌ర్వాత కొన్ని రోజుల్లోనే యూజ‌ర్లున్న‌ టాప్‌ దేశాల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు జ‌రిగాయి. అడ్వర్‌టైజర్ల సౌల‌భ్యం కోసం ఫేస్ బుక్‌ గణాంకాలను ఈ పోర్టల్‌ విడుదల చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నారని తెలిపింది.
 
భారత్‌లో యాక్టివ్‌ యూజర్లు  గ‌డిచిన ఆరు నెల‌ల్లో 27 శాతం పెర‌గ‌గా, అమెరికాలో 12 శాతం పెరిగారు. అయితే, భారత్‌లో ఫేస్‌బుక్‌ వ్యాప్తి మాత్రం తక్కువగానే నమోదైంది. జూన్‌ నెలలో భార‌త్ లో కేవలం 19 శాతం మంది ప్రజలే ఫేస్‌బుక్‌ను వాడారు. యాక్టివ్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌లో పురుషులే ఆధిక్యంలో ఉన్నారు. అమెరికాలో 54 శాతం మంది యాక్టివ్‌ యూజర్లు మహిళలే ఉన్నట్టు తెలిసింది. భార‌త్ లోని యాక్టివ్ యూజ‌ర్ల‌లో 25 ఏళ్ల లోపు వారు స‌గానికి పైగ ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు