త్వరలో మోడీ మరో కీలక నిర్ణయం

త్వరలో మోడీ మరో కీలక నిర్ణయం

నల్ల ధనాన్ని నియంత్రించే క్రమంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ మరో రెండు నెలల్లో ఇంకో కీలక ప్రకటన  చేయనున్నారన్న ఊహాగానాలు ఢిల్లీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని వినిపిస్తోంది.
   
పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఉద్గారాలను నిరోధించే క్రమంలో ఇ-వాహనాలకు ప్రోత్సాహం అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త సమగ్ర వాహన పథకాన్ని తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తోంది.

ఈ పథకం ద్వారా బ్యాటరీలతో నడిచే రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సుల పరిచయానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతోంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.
   
2019లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరిపి ముందస్తు ఎన్నికలకు వస్తారని.. ఆ క్రమంలో మైలేజి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. వాహనాల విషయంతో పాటు ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఊహిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు