ఐపీఎల్ లో సంచలనం.. 2 బంతుల్లో 18 రన్స్..

ఐపీఎల్ లో సంచలనం.. 2 బంతుల్లో 18 రన్స్..

క్రికెట్ లో ఒక బంతిని కొట్టడం ద్వారా మేగ్జిమమ్ తీయగలిగే పరుగులు 6. అలాంటప్పుడు 2 బంతులకు 12 పరుగలకు మించి రావు. కానీ... ఐపీఎల్ మ్యాచ్ లో కేవలం రెండు బంతుల్లోనే 18 పరుగులు రావడం గమనార్హం.  ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల జరిగి మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ చోటు చేసుకుంది. కేవలం రెండు బంతుల్లో 18 రన్లను నైట్ రైడర్స్ సాధించింది.

ముంబై ఇండియన్స్ బౌలర్ మెక్లెనగన్ వేసిన ఒక ఓవర్ లో ఇలా రెండు బంతుల్లో 18 పరుగులు లభించాయి. ఇది ఎలా సాధ్యమైందంటే.. మెక్లెనగన్ వేసిన తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టాడు మనీష్ పాండే. ఆ తర్వాత బంతిని బౌండరీకి తరలించాడు. ఈ బంతి నో బాల్ కావడంతో, అదనంగా మరో బంతి వేయాల్సి వచ్చింది. ఈ బంతిని అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. ఆ తర్వాత వేసిన ఎక్స్ ట్రా బాల్ ను మళ్లీ భారీ సిక్సర్ గా మలిచాడు పాండే. దీంతో, రెండు బంతుల్లోనే 6, 5, 1, 6 పరుగులు వచ్చాయి. అంటే మొత్తం 18 పరుగులన్న మాట.

వేసినవి నాలుగు బంతులైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ లెక్కల ప్రకారం నోబాల్, వైడ్ లెక్కలోకి రావు. కానీ.. వాటి ఆధారంగా పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇలా.. టెక్నికల్ గా రెండు బంతుల్లో మొత్తం 18 పరుగులు చేయడం సాధ్యమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు