అల‌ర్ట్ః డొమెస్టెక్ జ‌ర్నీకి కూడా పాస్ పోర్ట్ ఉండాల్సిందే

అల‌ర్ట్ః డొమెస్టెక్ జ‌ర్నీకి కూడా పాస్ పోర్ట్ ఉండాల్సిందే

విమాన‌ప్ర‌యాణాన్ని వీలైనంతగా చేరువ చేయాల‌ని భావిస్తున్న  కేంద్ర పౌర విమాన‌యాన శాఖ ఈ క్ర‌మంలో భ‌ద్ర‌త‌కు సైతం అదే రీతిలో ప్రాధాన్యం ఇచ్చేందుకు ముందుకు సాగుతోంది. ఇక డొమెస్టిక్ ఫ్లైట్స్‌కూ పాస్‌పోర్ట్ లేదా ఆధార్‌కార్డ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ నిబంధ‌న విధించ‌డానికి కేంద్ర పౌర‌విమాన‌యాన‌శాఖ సిద్ధ‌మ‌వుతోంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దేశీయంగా ఎక్క‌డికి వెళ్లాల‌న్నా కూడా గుర్తింపు కోసం ఈ రెండింటిలో ఏదో ఒక‌టి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే.

ఇప్ప‌టివ‌ర‌కు పాస్‌పోర్ట్ కేవ‌లం అంత‌ర్జాతీయ విమానాల్లో వెళ్ల‌డానికే త‌ప్ప‌నిస‌రిగా ఉంది. అయితే అదే ప్ర‌క్రియ‌ను దేశీయ విమాన ప్ర‌యాణాల‌కు కూడా అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇక విమానాల్లో దురుసుగా ప్రవ‌ర్తించే ప్ర‌యాణికుల కోసం కొత్త నిబంధ‌న‌ల‌ను కూడా రూపొందిస్తోంది. చేసిన త‌ప్పిదం తీవ్ర‌త‌ను బ‌ట్టి నాలుగు స్థాయిల్లో శిక్ష విధించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది.

ఎయిరిండియా ఉద్యోగిపై  శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ దాడి నేప‌థ్యంలో పౌర విమాన‌యాన శాఖ నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌న్న ఆలోచ‌న చేస్తోంది. సివిల్ ఏవియేష‌న్ రిక్వైర్‌మెంట్ ముసాయిదాను ప్ర‌జ‌ల ముందు ఉంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరాల‌ని నిర్ణయించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు