పెళ్లాన్ని.. పిల్లల్ని ఆ హైకోర్టు లాయర్ ఎంతగా కొడతాడంటే

పెళ్లాన్ని.. పిల్లల్ని ఆ హైకోర్టు లాయర్ ఎంతగా కొడతాడంటే

ఢిల్లీ హైకోర్టుకు చెందిన లాయర్ వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యను.. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కుమార్తెను ఇష్టారాజ్యంగా కొడుతూ.. తీవ్రంగా హింసించే వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఢిల్లీహైకోర్టుకు చెందిన లాయర్ చేస్తున్న ఆరాచకాలు బయటకు వస్తాయి.

ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో ఉండే ఢిల్లీ హైకోర్టు లాయర్.. తనకు కొడుకు పుట్టలేదన్న నెపంతో.. భార్యను.. ఇద్దరు కూతుళ్లను ఇష్టారాజ్యంగా కొడుతుంటాడు. తన తల్లిని.. తమను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక మృగం లాంటి తండ్రి ఆరాచకాల్నిబయటపడేలావీడియోను చిత్రీకరించారు. ఇది తాజాగా బయటకు వచ్చింది. న్యాయవాది భార్య చెప్పిన వివరాల ప్రకారం.. పెళ్లి అయి 15సంవత్సరాలు అవుతుందని.. మగ పిల్లాడ్నికనకుండా.. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కోపంతో నిత్యం తమను కొడుతుంటాడని పేర్కొంది.

సదరు లాయర్ కు చెందిన వీడియోలో భార్యను.. కుమార్తెను ఇష్టారాజ్యంగా తిడుతూ.. వారి మీద చేయి చేసుకున్న వైనం స్పష్టం కనిపిస్తుంది. అతగాడి ధాటికి అతడి కుమార్తె నేల మీద పడిపోయినట్లుగా వీడియోలోఉంది. రాక్షసుడిలా వ్యవహరిస్తూ.. ఇంట్లో వారిని దారుణంగా హింసిస్తున్న ఈ లాయర్ వివరాలు బయటకు రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు