ట్రంప్ గెలుపుతో ఆస్ట్రేలియాలో టెన్షన్

ట్రంప్ గెలుపుతో ఆస్ట్రేలియాలో టెన్షన్

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయదుంధుభి అమెరికన్లనే కాక ప్రపంచదేశాలనూ ఆశ్చర్యపరచింది. ట్రంప్ గెలుపుపై ఆయన మద్దతుదారులు ధీమాగానే ఉన్నా డెమోక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ దే హవా అని అంతా అనుకున్నారు. ఎగ్టిట్ పోల్స్, సర్వేలు కూడా తర్వాతి అధినేత హిల్లరీయే అని జోస్యం చెప్పాయి. లాస్ట్ మినిట్ లో కాలిక్యులేషన్ కాస్త అటుఇటు అయినా అమెరికాకు తొలి మహిళా అధినేత్రి ఖాయమని నిర్ణయానికొచ్చేశారంతా. కానీ, అంచనాలు తలకిందులు చేస్తూ ట్రంప్ విజయఢంకా మోగించి మిస్టర్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎన్నికల తంతు ముగిసిపోవడంతో.. ఇప్పుడు ట్రంప్ వల్ల లాభనష్టాలపై అన్ని దేశాలూ లెక్కలు ప్రారంభించాయి. ఆస్ట్రేలియా అయితే కాస్త టెన్షన్ లో ఉందట.

ట్రంప్ దూకుడు విధానాలతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అస్థిరత్వానికి దారితీసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా భద్రతా నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీజియన్ లో అమల్లో ఉన్న ఒబామా విదేశీపాలసీ అటకెక్కితే చిక్కులు తప్పవంటున్నారు. దీంతో  ట్రంప్ విధానాలకు తగినట్టుగా సాధ్యమైనంత త్వరగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జాతీయ భద్రత, వ్యూహాత్మక విధానాల్లో మార్పులు చేయాలని  ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రభుత్వానికి సూచించారు.

''అమెరికాకి ఆస్ట్రేలియా బలమైన, నమ్మకమైన భాగస్వామి. ట్రంప్ నాయకత్వంలో కూడా ఇరుదేశాల మధ్య బంధం అదే విధంగా కొనసాగాలి'' అని ఆమె ఆకాంక్షించారు. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు అణ్వస్త్రాలను సంపాదించుకోవాలని సూచించిన ట్రంప్ఒబామా విదేశాంగ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో అమెరికా వ్యూహాత్మక సంబంధాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ స్ట్రాటజిక్ డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ పీటర్ డీన్ హెచ్చరించారు. కాగా ఆస్ట్రేలియాకి వచ్చే నాలుగేళ్లు గడ్డుకాలమేనని మరో ప్రొఫెసర్ రోరీ మెడ్ కాఫ్ అభిప్రాయపడుతున్నారు. ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం భవిత కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉందని అంటున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు