అంతపెద్ద సంస్థ కూడా ముడుపులు ఇచ్చుకుంది

అంతపెద్ద సంస్థ కూడా ముడుపులు ఇచ్చుకుంది

బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ రోల్స్ రాయిస్కు చెందిన ముడుపుల బాగోతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గార్డియన్, బీబీసీ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ శిక్షణ కోసం ఉపయోగించే హాక్ ఎయిర్క్రాఫ్ట్ల ఇంజిన్ల తయారీ కాంట్రాక్టు కోసం ఓ ఏజెంట్కు రోల్స్రాయిస్ కోటి పౌండ్ల {సుమారు రూ.82 కోట్లు} ముడుపులు చెల్లించినట్లు ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ అక్రమ చెల్లింపులే రోల్స్ రాయిస్కు వేల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే కాంట్రాక్టును ఇచ్చాయని నిరూపించే కొన్ని విలువైన పత్రాలు గార్డియన్, బీబీసీ సంయుక్త విచారణ బయటపెట్టింది. బ్రిటన్, అమెరికాల్లోని అవినీతి నిరోధక శాఖలు ఈ డీల్ సెట్ చేసిన ఏజెంట్లపై దృష్టిసారించాయి.

ఈ సీక్రెట్ ఆపరేషన్కు సంబంధించిన కార్యక్రమాన్ని బీబీసీ తన పనోరమ ప్రోగ్రామ్లో టెలికాస్ట్ చేసింది. ఇందులో ఉన్న సమాచారం ప్రకారం రోల్స్ రాయిస్ నుంచి భారీగా ముడుపులు అందుకున్న వ్యక్తి ఆర్మ్స్ డీలర్ సుధీర్ చౌదరిగా బీబీసీ వెల్లడించింది. లండన్లో సెటిలైన ఈ వ్యక్తిని భారత ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టింది. అయితే తమ క్లైంట్ ఎలాంటి ముడుపులు తీసుకోలేదని సుధీర్ లాయర్ అన్నారు. ఈ ముడుపుల బాగోతంపై స్పందించడానికి రోల్స్ రాయిస్ కూడా నిరాకరించింది. మధ్యవర్తుల ప్రమేయంతో జరిగిన ఈ ముడుపులు, అవినీతి వ్యవహారంపై సీరియస్ ఫ్రాండ్ ఆఫీస్ {ఎస్ఎఫ్వో}తోపాటు ఇతర విచారణ సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

ఈ విచారణకు సహకరిస్తున్న నేపథ్ంయలో ప్రస్తుతం స్పందించడం సరికాదని రోల్స్ రాయిస్ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. రోల్స్ రాయిస్ ఇండియా సహా 12 దేశాల్లో ఇలా ఏజెంట్లను నియమించుకుందని బీబీసీ తెలిపింది. లేబర్, కన్జర్వేటివ్ పార్టీల్లో ఉన్న కీలక నేతలకు కూడా రోల్స్ రాయిస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వాళ్లు తరుచూ విదేశీ ప్రభుత్వాలతో కాంట్రాక్టులు రోల్స్ రాయిస్కే దక్కేలా లాబీయింగ్ చేశారని బీబీసీ రిపోర్ట్ వెల్లడించింది. రోల్స్ రాయిస్పై విచారణ ఇప్పుడు కొందరు మంత్రులను కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ తేల్చిచెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు