విజయ్ మాల్యా దీపావళి గిఫ్టు తెలుసా?

విజయ్ మాల్యా దీపావళి గిఫ్టు తెలుసా?

చింత చచ్చినా పులుపు చావలేదంటారు.. లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆర్థిక నేరాల్లో చిక్కుకుని దేశం దాటి వెళ్లిన ఆయన తన లైఫ్ స్టైల్ ను ఏమాత్రం మార్చుకోలేదట. ఎప్పటిలా అనుభవించు రాజా అనుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి పరారైన ఈ లిక్కర్ కింగ్ తన స్నేహితులకు మాత్రం కాస్ట్లీ గిఫ్టులు ఇస్తున్నాడు.

దీపావళి సందర్భంగా విజయ్ మాల్యా తన స్నేహితులకు కిక్కెంచించే కానుక ఇచ్చాడు. ఖరీదైన మద్యం బాటిల్లను ఆయన తన స్నేహితులందరికీ పంపించారట. పంపించిన తరువాత ఏమైనా కామ్ గా ఉన్నాడా అంటే అదీ లేదు. తాను బాకీ తీర్చాల్సిన బ్యాంకులను రెచ్చగొట్టేలా ఆ ఖరీదైన మద్యం సీసాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో బ్యాంకు అధికారులు... తమ బాకీ తీర్చడానికి డబ్బులు ఉండవు కానీ తాగితందనాలు ఆడడానికి మాత్రం డబ్బులుంటాయని శాపనార్థాలు పెడుతున్నారట.

కాగా మాల్యా కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలకు ఎగనామం పెట్టి ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్నారు. ఇక్కడి కోర్టులకు హాజరు కావాలని సమన్లు పంపిస్తున్నా ఆయన నుంచి సమాధానం ఉండడం లేదు. మాల్యాకు ఒక్క లిక్కర్ వ్యాపారమే కాకుండా చాలా వ్యాపారాలున్నాయి. విమాన సర్వీసులుండేవి. ఐపీఎల్ టీం కు కూడా ఆయన ఒకప్పుడు ఓనర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు